Friday, January 23, 2015

.....ఎంకి నాయుడుబావ.........
నాయుడుబావకై పుట్టింది నండూరి ఎంకి
ఏమి ఎరుగని ఎంకి ఊసులెన్నో సెపుతాది
ఎంకి మనసంతా బావకై ప్రేమ నింపుకుంటాది
ఏ యేళ అయినా ఎదురుచూస్త వుంటాది
ఏడకెళ్ళినగాని జాగు సెయ్యకమాకoటాది
బేగి వొచ్చెయ్యమంటాది బేల అవుతుంటాది
సూపులన్నీ బావకై చూరు కెళ్ళాడదీసి వుంటాది
జాడ తెలిసే దాకా వీధి మలుపుకేసి చూస్తనే వుంటాది
వీధిలో కెళ్ళాక సేయి వొదలనంటాది
ఒక్క క్షణమూ వీడిపోనంటాది
బావ గుండెల్లో గూడుకట్టుకుంటాది
ఎక్కడున్న గాని గుబులు సేస్తావుంటాది
పువ్వు లాంటి ఎంకి మనసు పలువరిస్తాది
బావ బావ అంటు కలువరిస్తాది
బావతోటి నడకలే మనసంతా నిండి వున్న
ఎంకి ఎంకి అంటూ నిద్దురలోనూ గుండె కొట్టుకుంటాది
కలల్లోను కబుర్లాడుతుంటాది
కదిలిపోనివ్వక కట్టి పడేస్తా వుంటాది
ఎంకి లేక నాయుడు బావ లేడంటూ
పెనవేసుకున్నారు ఎంకీ నాయుడు బావ
......వాణి కొరటమద్ది
20 jan 15

No comments:

Post a Comment