Sunday, January 11, 2015

......కలం..........
చేయూతనిచ్చే స్నేహంగా
దూరాన్ని దగ్గర చేసే చెలిమిగా
మది గాయాలకు మమత పంచే తోడుగా
దు:ఖాన్ని పోగొట్టే మంత్రంగా
భావాలకు అలంకరణ మౌతూ
కన్నీరు తుడిచే నేస్తం కలం
రచయితలకు నేస్తమై
రాజీకీయాలకు అస్త్రమై
మరుగైన మానవ సంబంధాలను
దిగజారే విలువలను ప్రశ్నిస్తూ
సమాజాన్ని ప్రశ్నించే ఆలంబన కలం
ఆకట్టుకునే చిత్రాలు
గుండె పగిలే వాక్యలు కలానికేగా సాధ్యం
ఆలోచనలు అక్షరాలుగా
జ్ఞాపకాలను స్పందనలుగా మారుస్తూ
అనుభూతలు అనుభావాలు ఆవేదనలు
ఒలికించే పదాలు ప్రకటించేది కలం
కన్నీళ్ళు ఒలికించినా
హాస్యాన్ని పలికించేది
ప్రేమను పలికిస్తూ
పౌరుషాన్ని రగిలిస్తూ
ఆవేశాన్ని వెల్లడిస్తూ
ఆక్రోశాన్ని వెళ్ళగ్రక్కుతూ
కత్తి కన్నా గొప్పదే కలం....!!
....వాణి కొరటమద్ది
28 nov 14

No comments:

Post a Comment