Thursday, January 29, 2015

1.మది భావాలన్నీ యవ్వనంలో విహరిస్తున్నాయి
పెరిగే వయసుకు దరిచేరక వృద్ధాప్యం ...!!

2 యవ్వనం జ్ఞాపకమై చిత్రాల్లో మిగులుతోంది
వృద్ధాప్యం మీదపడుతూ రోజుపేజీనీ తిప్పేస్తూ...!!

3. యవ్వనాల మెరుగులకై ఉరకలు వేస్తూ యువతరం
కొత్తపుంతలు తొక్కుతోంది కాస్మెటిక్ ప్రపంచంలో విహరిస్తూ...!!

4.బ్రతుకు పుస్తకంలోమరో పేజీ తిరిగి పోతోంది
అధిగమించలేని సవాళ్ళుమిగిలే వున్నవాటి ఆన వాళ్ళూ...!!

5.గుండె గుహలో ఎన్ని భావాలో 
వెలికి వచ్చేవన్నీ వేదనలే అవుతూ..!!

6.సిరిమువ్వల సవ్వడులు చిరునవ్వులు పలికించే 
నటరాజుకు నాట్య నీరాజనాలు...!!

7.నాలోకి నేనే ప్రయాణిస్తున్నా
అంతరంగ లోతుల్ని అంచనా వెయ్యడానికి ...!!!

8.స్వప్నాలు సాక్షాత్కారమైతే బావుండు 
మాధుర్యమేగా ఇక జీవితo...!!

9.పరవశమై పరిమళించే చెలిమి
చిరునవ్వుకు చేరువచెయ్యాలనే ఆకాంక్షతో...!!

10.నడుమ నడయాడుతూనే వుంది
వెన్నెలకు వేదనకు మధ్య జ్ఞాపకం...!!

11.వికసించే భావాలు తొలిమంచు ఉషోదయాలు
చిరు మందహాసాల నులివెచ్చని సమీరాలు...!!

12.మిడిసిపడుతోంది యవ్వనం నేడు సమాజంలో
వృద్ధుల నిర్లక్షానికికారణమౌతూ...!!

13తలపులు తల్లడిల్లుతున్నాయి
చెదిరిన చిరునవ్వులుకావాలనిపిస్తూ ....!!

14.1.మది ముక్కలౌతోంది 
గాయాల జ్ఞాపకాలు బాకుల్లా గుండెల్లో గుచ్చుకుంటూ...!!

15. అనుక్షణం మనసును కత్తులతో గుచ్చుతున్నట్లే ... 
నీ స్పర్శకు దూరమై...!!

16..తల్లడిల్లుతోంది మనసు
నువ్వు మిగిల్చిన ఆనవాళ్ళు తడిమినపుడల్లా...!!

17.గాయపు గాటు మానుతుందేమో 
నీ వేటుకు మనసు తల్లడిల్లుతూనే వుంది...!!

18..కన్నీళ్ళు సరిపోలేదేమో
మది స్రవించే రుధిరాన్ని చూసి సంబరమేమో...!!

19. అయోమయంలోకపోతం
.శాంతిని కోల్పోతున్నవిశ్వాన్ని చూస్తూ ..!!

20. శాంతినే కాదు
ప్రకృతిపై ప్రేమను పెంచుకోమంటూ పావురాయి సందేశం...!!

21. శాంతి కపోతాన్నే 
 ప్రేమసందేశాన్ని చేరవేసే పావురాన్ని కూడా ...!! 

No comments:

Post a Comment