Friday, January 9, 2015

.........అపుడు అమ్మలా........

కట్టలు తెంచుకున్న దు:ఖాన్ని
ఆపే ప్రయత్నం ఆమెది

వెల్లువెత్తిన కన్నీటిని
తుడుస్తూనే వుంది

గండిపడ్డ గుండె
ఇసుక మూటలౌతున్నాయ్
ఆమె చేతులు

గోడలు కట్టినా ఆగని
కన్నీటి ప్రవాహం

మింగుడు పడని కన్నీళ్ళు
పేగులు మెలిపెడుతూ గాయం

పచ్చి గాయం మీద
స్పిరిట్ పోస్తున్నట్లు
కొందరి మాటలు

మానని గాయానికి
మందు రాస్తున్నట్లు
వారి ప్రవర్తన

హత్తుకోవాల్సిన గుండెను
అవహేళన చేస్తున్నట్లు భావన

కన్నీరే మింగుడు పడని కడుపుకి
చెంత లేని తల్లిని తలపిస్తూ
మండుతున్న పేగుకి
ఆకలి తీర్చాలనే
ఆమె ప్రయత్నం

హత్తుకున్న అక్క
అపుడు అమ్మలా అనిపించింది....!!


.........వాణి

No comments:

Post a Comment