Sunday, January 11, 2015

అబల - సబల.
అంకురం మొదలు అవసాన దశ వరకూ
సమస్యల సుడిగుండమే అమె జీవితం
బంధాలపై ఆధారపడే బతుకే సాంతం
స్త్రీ చుట్టూ కష్టాల ముళ్ళపొదలు
అనుక్షణం వెంట వుండే వేదనలు వేధింపులు
ఆకతాయిల మాటల్ని ఆవహించే చూపుల్ని
అడుగడుగునా ఆంక్షల్ని అధిగమిస్తొంది
విధ్యార్ధి దశలోనూ ఉద్యొగ నిర్వహణలోనూ సహనం వహిస్తూ
మార్గ నిర్ధేశం చేస్తూ శభాష్ అనిపించుకుంటూ
నైతికబలం లోనూ శక్తి వంతురాలిగా సృజన కలిగిన గొప్పదనం.
కట్టుబాట్లు అనుసరిస్తూ కన్నవారి కోరికలకు తలవొoచుతూ
కోటి ఆశలతో మెట్టినింట అడుగిడుతుంది స్త్రీ
అక్కడా ఆమెకి తెరుచుకునే వుంటాయి దు:ఖపు వాకిళ్ళు
అంత కమ్మనైన పెళ్ళి నమ్మకమే అనుకుంటూ
ఎదురయ్యే నిందలూ నిష్టూరాలు సహిస్తూ
క్షణక్షణం బాధలే జన్మoతా బందీగా ధనం దాహంతో కట్నపు వేధింపులే
అనుమానాలు అభాండాలు ఆశలకు ఆహుతైపొతూ స్త్రీ
యుగాలు, తరాలు మారినా మహిళల తలరాతలు నీటిమీది రాతలే.
ఇల్లాలయినా, రాజ్యాలేలే నేత అయినా
మగవారి అకృత్యాలతో అణచబడుతూనే వుంది
అసమానతలు ఆంక్షలు నిందలు నిష్టూరాలు
వెరసి స్ర్తీ కోల్పోతోంది స్వేచ్చా స్వాతంత్ర్యం.
ధైర్యాన్ని నేస్తంగా ఉంచుకుని అబల అనే మాట మరచి. సహనమూర్తిగా
చుట్టూ సమస్యల వలయాన్ని చేధించి సాధించి సబలగా నిరూపించు
రక్షించేవారి కోసం నిరీక్షణతో నిరుత్సాహపడక,
ఆదిశక్తిగా అవతారమెత్తి దుష్టశక్తులను అణచి వెయ్య వమ్మా..!!
- వాణి కొరటమద్ది.

No comments:

Post a Comment