Sunday, January 11, 2015

... ఎందుకలా...!...
అప్పటి దాకా అవన్నీ రహస్యాలే
ఏడడుగుల నడవగానే
మర్మాలన్నీ నీవై పోయాయ్
మనసులోని ఊసులన్ని నీ సొంతమే
ఏదో ఆశ తన కోసమే నువ్వని
అలనాటి జ్ఞాపకాలే నీతో పంచుకుంటూ
ఎంత ఉత్సాహం కొత్త కళే తనలో
ఇద్దరి కలయిక నమ్మకమనుకుంది
అదే తన అసహాయత
సాధించానన్నసంతృప్తి కొంత కాలమే
తెలియని అసలు రూపం
నీలో దాచుకున్న కర్కశత్వం
బలి చేస్తానన్న ఆశల రూపాన్నీ
ఎలా రక్షించాలని
ఉమ్మి నీటిలో బజ్జున్న గుడ్డును ఎలా కాపాడాలి?
భయంగా ముడుచుకున్న చిట్టితల్లిని
బయటకెలా తీసుకురావాలి
ఆరగించే చూపులనుండి ఆవహించే చేతుల నుండి
ఎలా రక్షణ నివ్వను
ఎంత చదువుకున్న మూర్ఖుడవు కదూ నువ్వు
మలినమైన మనసుతో
నేనంటే ప్రాణమంటావ్
నాలోని ఆడబిడ్డను మాత్రం వొద్దంటావ్
ఆడతనంతోనేగా నువ్వు బయటకు విసిరివేయబడ్డావ్
అంత ద్వేషంతో అమ్మా అని ఎలా పిలుస్తున్నావ్?

.....వాణి

No comments:

Post a Comment