Friday, January 23, 2015

...... సంక్రాంతి .........
పల్లె పల్లె పరవశిస్తోంది
నగర బంధాలన్ని హత్తుకోగానే
గర్వపడుతుందీ పల్లె సంక్రాంతి రోజుల్లో
పట్టణ జనులంత పల్లె చేరుకోగానే
ముగ్గుల్లో మెరుస్తూ సప్త వర్ణాలన్నీ
వెలిగిపోతున్నాయి ముంగిళ్ళు అన్నీ
ముగ్గుల మధ్యన అలరించు గొబ్బెమ్మలు
చలికాచుకుంటూ వీధులలో భోగిమంటలు
గరిసెలన్నీ నిండు కుండలైనాయి
ధాన్యలక్ష్మీ ఇంటింట వెలిగిపోతోంది
పిండివంటల ఘుమఘుమలు ప్రతిఇంటి నుండి
ఇనుమడించే రుచులు కొత్త ధాన్యాలతో
పట్టు పరికిణీ ధరించి పడుచు పిల్లలంతా
మురిసిపోతున్నారు ముచ్చటగ వాళ్ళంతా
చిన్న పిల్లలకు భోగిపళ్ళు,
బొమ్మల కోలువుల సందళ్ళు
పితృదేవతలకు తర్పణాలు,
గుమ్మడికాయల దానాలు
మకరరాశిలో ప్రవేశించి సూర్యుడు
ఉత్తరాయణ పుణ్యకాలం
హేమంత రుతువులోన పుస్యమాసములోన
సంబరంగ జరుపుకునే సంక్రాంతి పండుగ...!!
......వాణి కొరటమద్ది
15 jan 15

No comments:

Post a Comment