Sunday, January 11, 2015

........ తల్లడిల్లే తలపు ..........
రాలిన కన్నీళ్ళన్నీ
అక్షరాలై పోయాయి
భావాల పరంపరలో
భాగంగా మిగిలాయి

గుండెలో వేదనంతా
గోప్యంగానే వుంది
వెలికి వస్తే కన్నీటి
విస్ఫోటనమే అవుతుంది
మదినపుడపుడపుడు
తడుముతూ జ్ఞాపకమై వస్తుంది
తల్లడిల్లే తలపుల్లో
తడి తడుపుతూనే వుంటుంది
మానని గాయాలకు
మౌనమే మంత్ర మయ్యింది
ఆమౌనంలో మనసు
భాష నేర్చుకొంటొంది
గాయపడ్డ క్షణాలన్నీ
అనుభవాలే అయ్యాయి
నడుస్తున్న జీవితానికి
దారుల్ని చూపుతాయి
వాణి

No comments:

Post a Comment