Friday, January 9, 2015

..స్నేహ సంద్రం.......
సముద్రం చెంత చేరతాను
కన్నీళ్ళు తుడవమంటూ
ఒలికించిన నీళ్ళను
దాచలేని కన్నీళ్ళను
ఆవహించుకుంటొంది
అపుడు అశ్రువులకు
ఆత్మీయత అంటుంకుంటుంది
ఓ స్నేహం దొరికినట్లు
అలల నవ్వులను ఆస్వాదించమని
తడుముతూ గిలిగింతలు పెడుతూ
మాటి మాటికీ హత్తుకుంటూ
చుట్టూ తచ్చాడుతూనే వుంది
తోడుగా వున్నానంటూ తరంగం
వెనక్కి వెళుతున్న నన్ను చూసి
మళ్ళీ రమ్మంటూ
ఎగసి పడే అలలతోనే
ఆహ్వానం పలుకుతోoది
వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే వుంటాను
తడిసిన పాదాలను చూస్తూ
కనుల చెమ్మ తుడుచుకుంటాను
మళ్ళీ మళ్ళీ వస్తానని
మనసుతోనే చెప్పుకుంటాను
ఇసుకతో నిండిన కాళ్ళను
మోస్తూ వెళుతున్నాను
అంటి పెట్టుకున్నంత సేపూ
ఓదార్పును అనుభవిస్తాను...!!
....వాణి కొరటమద్ది

No comments:

Post a Comment