Thursday, January 29, 2015

..........తెగిన గాలి పటాలు ....
తెరచాటు నిర్లక్ష్యాలకు తెగిన గాలి పటాలు వాళ్ళు
హత్తుకునే గుండెలు లేక రోడ్డున పడ్డ అనాధలు

పొత్తిళ్ళ నవ్వులు అనుభవం లేదనేమో
ఆకాశాన ఆనందాలు వెతుక్కుంటున్నారు

చిరుజల్లుల చిరునవ్వుల్లో తడిసిపోతున్నారు
గమ్యం తెలియని తెగిన పతంగులే వాళ్ళ జీవితాలు

విను వీధిలో ఎగిరే పక్షుల్లా
నడి వీధిలో దిక్కుతోచని వారి బ్రతుకులు

పొట్టాకూటికోసం పాట్లు పడుతున్నారు
మాంజాల తయారిల్లో మునకలౌతున్నారు

చెదిరిన వారి మనసుల్లో గాయాలెన్నో
గడిచిన జీవితంలో కోల్పోయిన సంతోషాలెన్నో....!!

......వాణి కొరటమద్ది

No comments:

Post a Comment