Friday, January 23, 2015

.......బ్రతుకు అన్వేషణ ......
గుండె గూటిలో ఎన్ని కన్నీళ్ళో
గాయాల బాదలు ఎన్నో
బాధ్యత మరచిన భర్త వేదింపులెన్నైనా
పెనవేసుకున్న పేగుబంధం
తపన పడుతోంది మాతృహృదయం
కట్టేలతో పాటూ కాలుతున్న వేలి కొసలు
బొగ్గుల లానే భగ్గుమంటూ గుండెలు
కారే కన్నీళ్ళు కాలే మంటనార్పగలవేమో
గుండె గదిలో వేదన చల్లార్చడం లేదు
కోరికలన్నీ మరచి ఒక్కటే ఆశ ఆమెకు
చేసిన పదార్ధం కొనేవాళ్ళు కనిపిస్తే
వచ్చేనాలుగు రూపాయలు
పసిదాని ఆకలి తీరిస్తే చాలు
మరో వేకువకై ఎదురుచూస్తూ
బిడ్డ ఆకలి తీరే మార్గం అన్వేషిస్తూ
అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ
అలా అలా రోజులు మారితే సరి
చిట్టిదాని బ్రతుక్కు బాట చూపేదాకా...!!

No comments:

Post a Comment