Thursday, January 29, 2015

1.మది భావాలన్నీ యవ్వనంలో విహరిస్తున్నాయి
పెరిగే వయసుకు దరిచేరక వృద్ధాప్యం ...!!

2 యవ్వనం జ్ఞాపకమై చిత్రాల్లో మిగులుతోంది
వృద్ధాప్యం మీదపడుతూ రోజుపేజీనీ తిప్పేస్తూ...!!

3. యవ్వనాల మెరుగులకై ఉరకలు వేస్తూ యువతరం
కొత్తపుంతలు తొక్కుతోంది కాస్మెటిక్ ప్రపంచంలో విహరిస్తూ...!!

4.బ్రతుకు పుస్తకంలోమరో పేజీ తిరిగి పోతోంది
అధిగమించలేని సవాళ్ళుమిగిలే వున్నవాటి ఆన వాళ్ళూ...!!

5.గుండె గుహలో ఎన్ని భావాలో 
వెలికి వచ్చేవన్నీ వేదనలే అవుతూ..!!

6.సిరిమువ్వల సవ్వడులు చిరునవ్వులు పలికించే 
నటరాజుకు నాట్య నీరాజనాలు...!!

7.నాలోకి నేనే ప్రయాణిస్తున్నా
అంతరంగ లోతుల్ని అంచనా వెయ్యడానికి ...!!!

8.స్వప్నాలు సాక్షాత్కారమైతే బావుండు 
మాధుర్యమేగా ఇక జీవితo...!!

9.పరవశమై పరిమళించే చెలిమి
చిరునవ్వుకు చేరువచెయ్యాలనే ఆకాంక్షతో...!!

10.నడుమ నడయాడుతూనే వుంది
వెన్నెలకు వేదనకు మధ్య జ్ఞాపకం...!!

11.వికసించే భావాలు తొలిమంచు ఉషోదయాలు
చిరు మందహాసాల నులివెచ్చని సమీరాలు...!!

12.మిడిసిపడుతోంది యవ్వనం నేడు సమాజంలో
వృద్ధుల నిర్లక్షానికికారణమౌతూ...!!

13తలపులు తల్లడిల్లుతున్నాయి
చెదిరిన చిరునవ్వులుకావాలనిపిస్తూ ....!!

14.1.మది ముక్కలౌతోంది 
గాయాల జ్ఞాపకాలు బాకుల్లా గుండెల్లో గుచ్చుకుంటూ...!!

15. అనుక్షణం మనసును కత్తులతో గుచ్చుతున్నట్లే ... 
నీ స్పర్శకు దూరమై...!!

16..తల్లడిల్లుతోంది మనసు
నువ్వు మిగిల్చిన ఆనవాళ్ళు తడిమినపుడల్లా...!!

17.గాయపు గాటు మానుతుందేమో 
నీ వేటుకు మనసు తల్లడిల్లుతూనే వుంది...!!

18..కన్నీళ్ళు సరిపోలేదేమో
మది స్రవించే రుధిరాన్ని చూసి సంబరమేమో...!!

19. అయోమయంలోకపోతం
.శాంతిని కోల్పోతున్నవిశ్వాన్ని చూస్తూ ..!!

20. శాంతినే కాదు
ప్రకృతిపై ప్రేమను పెంచుకోమంటూ పావురాయి సందేశం...!!

21. శాంతి కపోతాన్నే 
 ప్రేమసందేశాన్ని చేరవేసే పావురాన్ని కూడా ...!! 

1.నీ ఊహల మైమరపులతో నిద్రిస్తున్నానేమో .. కలలొలుకుతున్నాయి...!!

2..మబ్బులకూ ఒయారమే... చిరునవ్వులు చిరుజల్లై కురుస్తున్నాయిగా...!!

3..నిశ్శబ్ధం విసుక్కొంది... మౌనంతో మాటలెంతసేపంటూ...!!27.1.15

4.తీరని ఆశలు వెంటాడుతుంటే కొత్త కోరికలు కావాలంటూ ... జీవితం దాహిస్తుంది...!!

7. స్నేహితుల సాంగత్యంతో మౌనం ఇంకిపోతూ.... మనసు మాటలు నేర్చుకుంటోంది..!!

8. అనుక్షణం కారే కన్నీటి చారికలు కనబడకుండా ...కాటుక తుడిచేస్తున్నా..!!

9. వన్నెలతో ప్రతి మనసుని పులకింప చేస్తోందిగా ....వెన్నెలకి వయసొచ్చింది...!!

10.రహదారికో వసంతం .... ప్రతి మనిషీ పచ్చదనకోసం పరితపిస్తే..!! 22.1.15

11. మనసు మౌనంతో మాటాడుతోంది స్వరరహిత శబ్ధమై...!!

12. ఘనీభవించిన దప్పికై వెలికిరాని కన్నీళ్ళు....!!

13. మనసు చివరిలోకాదు మనసంతా జ్ఞాపకమై ఉన్నావుగా...!!

14. కలువలు కాసే కళ్ళు వెండి వెలుగులకై వేచి ఉన్నాయి...!!

15. ఒణికిస్తున్న వెన్నెల నులి వెచ్చని స్పర్శను కోరుకుంటూ...!

17. మనసు మౌనంతో మాటాడుతోంది స్వరరహిత శబ్ధమై...!!

18. ఘనీభవించిన దప్పికై వెలికిరాని కన్నీళ్ళు....!!

19. మనసు చివరిలోకాదు మనసంతా జ్ఞాపకమై ఉన్నావుగా...!!

20. కలువలు కాసే కళ్ళు వెండి వెలుగులకై వేచి ఉన్నాయి...!!

21 ఒణికిస్తున్న వెన్నెల నులి వెచ్చని స్పర్శను కోరుకుంటూ...!!

22.బంధాలన్నీ బలమైనవే ...చేరువలతో చిరునవ్వులు చేజారుటలో చెమరింతలు....!!
1.నిస్సహాయులై నాటి నేతలు.. నిర్భయల కన్నీరు తుడవలేక ..!!

2.చేష్టలుడిగి చూస్తోంది జాతీయజెండా.. మృగాలు సంచరించే భారతాన్ని చూస్తూ...!!

3.ఎగురూతూ ఉండమ్మా మువ్వన్నెల జెండా .. నిజమైన స్వాతంత్ర్యం మాకొచ్చేదాకా..!!

4.నిత్యం గణతంత్రదినాలే ...ప్రజాస్వామ్యమే మనదని హక్కులకై పోరాడుతూ..!!

5.మతసామరస్యంకి ప్రతీక పతాక ...తెలిసీ కులాల ప్రత్యేకత చాటుతూ...!!

..........తెగిన గాలి పటాలు ....
తెరచాటు నిర్లక్ష్యాలకు తెగిన గాలి పటాలు వాళ్ళు
హత్తుకునే గుండెలు లేక రోడ్డున పడ్డ అనాధలు

పొత్తిళ్ళ నవ్వులు అనుభవం లేదనేమో
ఆకాశాన ఆనందాలు వెతుక్కుంటున్నారు

చిరుజల్లుల చిరునవ్వుల్లో తడిసిపోతున్నారు
గమ్యం తెలియని తెగిన పతంగులే వాళ్ళ జీవితాలు

విను వీధిలో ఎగిరే పక్షుల్లా
నడి వీధిలో దిక్కుతోచని వారి బ్రతుకులు

పొట్టాకూటికోసం పాట్లు పడుతున్నారు
మాంజాల తయారిల్లో మునకలౌతున్నారు

చెదిరిన వారి మనసుల్లో గాయాలెన్నో
గడిచిన జీవితంలో కోల్పోయిన సంతోషాలెన్నో....!!

......వాణి కొరటమద్ది
//నీ రూపం...//
పెదవి దాటని మాటలకు
మౌనమే సాక్షమ్ములే

మనసులోని భావమంతా
పదములుగ ప్రకటింతులే

ఆగిపోని ఆలోచనంతా
గడిచిపోయిన జ్ఞాపకములే

కనుమరుగైన రూపానికి
కనిపించదు నా కన్నీరులే

జరిగిపోయిన కాలమంతా
తిరిగిరాని స్వప్నమే

ఆశపడిన జీవితం
అందని అదృస్ఠమే

మిగిలిపోయిన జీవితం
నీ గురుతుల నీడలే

మనసు అంతా పరచుకున్న
మమత నిండిన నీ రూపమే
మరలి రాని అదృస్ఠమే
....వాణి

Friday, January 23, 2015

.......తెలుగు గజల్...8......
నీ నవ్వుల మల్లెలన్ని ఏరుకుంటు ఉన్నానూ
నీ మాటల ముత్యాలను దాచుకుంటు ఉన్నానూ

నా మదిలో భావాలే కవనంలో ప్రవహిస్తూ
మనసంతా నీప్రేమే నింపుకుంటు ఉన్నానూ

జ్ఞాపకాల తోటలోన బాల్యానికి మరలవెళ్ళి
మురుస్తున్న నామనసులొనవ్వుకుంటు ఉన్నానూ

వేకువలో విరబూసే పువ్వులన్నీ నవ్వుతుంటె
పూవ్వునయ్యి మురవాలని వేడుకుంటు ఉన్నానూ

ఇల అంతా వణికించే చలిదుప్పటి నీడలో
నులివెచ్చని కిరణాలను కోరుకుంటు ఉన్నాను

మౌనంలో మాటలన్ని అక్షరాల్లో ప్రకటిస్తూ
భావాల పరంపరలో ఒంపుకుంటు ఉన్నానూ

......వాణి కొరటమద్ది
21 jan 15
పాపాయిలు ఇంటింటికీ దీపాలు
చిరునవ్వుల రూపాలు
జగతి ప్రగతికి కి సోపానాలు
చినుకులు రాలినపుడల్లా
చిరునవ్వులు వర్షిస్తే బావుండని
దొసిలి నింపుకుని ఆ నవ్వులు
చెక్కిలికి అతికిoచుకుందామని...!!
.......బ్రతుకు అన్వేషణ ......
గుండె గూటిలో ఎన్ని కన్నీళ్ళో
గాయాల బాదలు ఎన్నో
బాధ్యత మరచిన భర్త వేదింపులెన్నైనా
పెనవేసుకున్న పేగుబంధం
తపన పడుతోంది మాతృహృదయం
కట్టేలతో పాటూ కాలుతున్న వేలి కొసలు
బొగ్గుల లానే భగ్గుమంటూ గుండెలు
కారే కన్నీళ్ళు కాలే మంటనార్పగలవేమో
గుండె గదిలో వేదన చల్లార్చడం లేదు
కోరికలన్నీ మరచి ఒక్కటే ఆశ ఆమెకు
చేసిన పదార్ధం కొనేవాళ్ళు కనిపిస్తే
వచ్చేనాలుగు రూపాయలు
పసిదాని ఆకలి తీరిస్తే చాలు
మరో వేకువకై ఎదురుచూస్తూ
బిడ్డ ఆకలి తీరే మార్గం అన్వేషిస్తూ
అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ
అలా అలా రోజులు మారితే సరి
చిట్టిదాని బ్రతుక్కు బాట చూపేదాకా...!!

...... సంక్రాంతి .........
పల్లె పల్లె పరవశిస్తోంది
నగర బంధాలన్ని హత్తుకోగానే
గర్వపడుతుందీ పల్లె సంక్రాంతి రోజుల్లో
పట్టణ జనులంత పల్లె చేరుకోగానే
ముగ్గుల్లో మెరుస్తూ సప్త వర్ణాలన్నీ
వెలిగిపోతున్నాయి ముంగిళ్ళు అన్నీ
ముగ్గుల మధ్యన అలరించు గొబ్బెమ్మలు
చలికాచుకుంటూ వీధులలో భోగిమంటలు
గరిసెలన్నీ నిండు కుండలైనాయి
ధాన్యలక్ష్మీ ఇంటింట వెలిగిపోతోంది
పిండివంటల ఘుమఘుమలు ప్రతిఇంటి నుండి
ఇనుమడించే రుచులు కొత్త ధాన్యాలతో
పట్టు పరికిణీ ధరించి పడుచు పిల్లలంతా
మురిసిపోతున్నారు ముచ్చటగ వాళ్ళంతా
చిన్న పిల్లలకు భోగిపళ్ళు,
బొమ్మల కోలువుల సందళ్ళు
పితృదేవతలకు తర్పణాలు,
గుమ్మడికాయల దానాలు
మకరరాశిలో ప్రవేశించి సూర్యుడు
ఉత్తరాయణ పుణ్యకాలం
హేమంత రుతువులోన పుస్యమాసములోన
సంబరంగ జరుపుకునే సంక్రాంతి పండుగ...!!
......వాణి కొరటమద్ది
15 jan 15
......గాయపడ్డ జ్ఞాపకం......
మనసు నీ కోసం పరిభ్రమిస్తూనే వుంటుంది
గతించిన కాలాన్ని లెక్క వేస్తూనే వుంటుంది
ఆశల పల్లకీ లో నుండి జారి పడిపోయాను
జీవిత నడకను సాగిస్తూనే వున్నాను
రాలి పడ్డ చిరునవ్వులు ఏరుకోవాలని..
విఫలమైపోతున్నా ప్రయత్నల్లోనూ..
సానుభూతి సమీరాల్లో భాష్పాలు ఒలబోస్తూ
ఓదార్పు పవనాల్లో కన్నీళ్ళు ఆరబెడుతున్నా
విరక్తి నవ్వులతో విసురుకుంటున్నాను
వెంట వచ్చే వేదన వెక్కిరిస్తూనేవుంది
విదిలించుకు ముందుకు సాగేంత
చిన్నదేం కాదుగా గాయపడ్డ జ్ఞాపకం...!!
..........వాణి
గండి పడ్డ కన్నీటి నదులు
ప్రవాహం ఆగడంలేదు
ఆపే ప్రయత్నంలో
అరచేతులే ఇసుకమూటలౌతున్నా
లెక్కలేని ఆలోచనలు
మదిలో మూటకట్టుకున్నాయి
తీరoలో ఒంటరిగా
మూగ మనసుకు సర్ది చెప్పుకుంటూ
మునివేళ్ళరాతతో ఆలోచనలకు
మార్గాలు వెతుకుంటూ
అప్రయత్నంగా
కుప్పగా మారిన ఇసుకలో
అంతరంగ మదనాలన్నీరాశులు పోశానేమో
అర్ధం కాని స్ధబ్ధత ఆవరించి
తడబడుతూ తీరంలో
ఓటములెన్నో జ్ఞాపకాల్లో
గెలుపులు వెతుకుతూనే వున్నా
కడలి అంచుల్లో కొత్త కోరికలుకై
దూరమైన ఆశలన్నీ
తరంగo తోడుతో తిరిగివోస్తాయని....!!

.....ఎంకి నాయుడుబావ.........
నాయుడుబావకై పుట్టింది నండూరి ఎంకి
ఏమి ఎరుగని ఎంకి ఊసులెన్నో సెపుతాది
ఎంకి మనసంతా బావకై ప్రేమ నింపుకుంటాది
ఏ యేళ అయినా ఎదురుచూస్త వుంటాది
ఏడకెళ్ళినగాని జాగు సెయ్యకమాకoటాది
బేగి వొచ్చెయ్యమంటాది బేల అవుతుంటాది
సూపులన్నీ బావకై చూరు కెళ్ళాడదీసి వుంటాది
జాడ తెలిసే దాకా వీధి మలుపుకేసి చూస్తనే వుంటాది
వీధిలో కెళ్ళాక సేయి వొదలనంటాది
ఒక్క క్షణమూ వీడిపోనంటాది
బావ గుండెల్లో గూడుకట్టుకుంటాది
ఎక్కడున్న గాని గుబులు సేస్తావుంటాది
పువ్వు లాంటి ఎంకి మనసు పలువరిస్తాది
బావ బావ అంటు కలువరిస్తాది
బావతోటి నడకలే మనసంతా నిండి వున్న
ఎంకి ఎంకి అంటూ నిద్దురలోనూ గుండె కొట్టుకుంటాది
కలల్లోను కబుర్లాడుతుంటాది
కదిలిపోనివ్వక కట్టి పడేస్తా వుంటాది
ఎంకి లేక నాయుడు బావ లేడంటూ
పెనవేసుకున్నారు ఎంకీ నాయుడు బావ
......వాణి కొరటమద్ది
20 jan 15
.......అక్షరాల ఓదార్పు....
గుండె గుహలో భావాలు ఎన్నో
వేదనలే అవుతున్నాయి వెలికి వచ్చేవన్నీ
రెప్పల మాటున మాసిన ఆశల ఊహల చిత్రాలెన్నో
నెరవేరని నిన్నటి కలలు
ఉక్కిరి బిక్కిరి చేస్తూ రేపటి ఆశల మధ్య
నలుగుతున్న రాత్రులెన్నో
సమస్యల సముద్రాలు దాటే ప్రయత్నంలో
వదిగిన క్షణాలెన్నో
ఒలికిన కన్నీటి సిరా
తెల్లని కాగితంపై
నల్లని అక్షరాలౌతాయి
జతకూడిన ఒక్కో అక్షరం
కొత్త భావాన్ని సంతరించుకుంటుంది
మనసు ప్రక్షాళన అవూతూ
కాగితంపై కవితగా మారుతుంది
వేదనలో ఒదిగిన గుండె
కాసిన్ని గాలుల్ని బయటకు వదిలెస్తుంది
మామూలు ప్రపంచాన్ని చూస్తుంది
జ్ఞాపకాల దొoతరలు
అక్షరాలై కురుస్తుంటాయి
ఒక్కో పదం ఒక్కో ఓదార్పై
భావాల అంతరంగంలో విహరిస్తుంది
ఆశలేని మనసుకు
అక్షరాలే కోరికలు నేర్పుతుంటాయి
....వాణి కొరటమద్ది

Sunday, January 11, 2015

...........ఆశ............
నిశ్శబ్ధాన్ని మూటకట్టి నిశీధిలో వెతకడం
మౌనంతో మాటాడుతు వెన్నెలకై తడమడం
ఆశల వర్షం కురిపిస్తుందని
ఆకాశం వంక చూస్తున్నపుడు
నిత్యం వెన్నెల విహారం వరించకున్నా
అపుడపుడు మెరుపుల్లా
మైమరపులు కావాలని
చినుకులు రాలినపుడల్లా
చిరునవ్వులు వర్షిస్తే బావుండని
దొసిలి నింపుకుని ఆ నవ్వులు
చెక్కిలికి అతికిoచుకుందామని...!!
........ తల్లడిల్లే తలపు ..........
రాలిన కన్నీళ్ళన్నీ
అక్షరాలై పోయాయి
భావాల పరంపరలో
భాగంగా మిగిలాయి

గుండెలో వేదనంతా
గోప్యంగానే వుంది
వెలికి వస్తే కన్నీటి
విస్ఫోటనమే అవుతుంది
మదినపుడపుడపుడు
తడుముతూ జ్ఞాపకమై వస్తుంది
తల్లడిల్లే తలపుల్లో
తడి తడుపుతూనే వుంటుంది
మానని గాయాలకు
మౌనమే మంత్ర మయ్యింది
ఆమౌనంలో మనసు
భాష నేర్చుకొంటొంది
గాయపడ్డ క్షణాలన్నీ
అనుభవాలే అయ్యాయి
నడుస్తున్న జీవితానికి
దారుల్ని చూపుతాయి
వాణి
అబల - సబల.
అంకురం మొదలు అవసాన దశ వరకూ
సమస్యల సుడిగుండమే అమె జీవితం
బంధాలపై ఆధారపడే బతుకే సాంతం
స్త్రీ చుట్టూ కష్టాల ముళ్ళపొదలు
అనుక్షణం వెంట వుండే వేదనలు వేధింపులు
ఆకతాయిల మాటల్ని ఆవహించే చూపుల్ని
అడుగడుగునా ఆంక్షల్ని అధిగమిస్తొంది
విధ్యార్ధి దశలోనూ ఉద్యొగ నిర్వహణలోనూ సహనం వహిస్తూ
మార్గ నిర్ధేశం చేస్తూ శభాష్ అనిపించుకుంటూ
నైతికబలం లోనూ శక్తి వంతురాలిగా సృజన కలిగిన గొప్పదనం.
కట్టుబాట్లు అనుసరిస్తూ కన్నవారి కోరికలకు తలవొoచుతూ
కోటి ఆశలతో మెట్టినింట అడుగిడుతుంది స్త్రీ
అక్కడా ఆమెకి తెరుచుకునే వుంటాయి దు:ఖపు వాకిళ్ళు
అంత కమ్మనైన పెళ్ళి నమ్మకమే అనుకుంటూ
ఎదురయ్యే నిందలూ నిష్టూరాలు సహిస్తూ
క్షణక్షణం బాధలే జన్మoతా బందీగా ధనం దాహంతో కట్నపు వేధింపులే
అనుమానాలు అభాండాలు ఆశలకు ఆహుతైపొతూ స్త్రీ
యుగాలు, తరాలు మారినా మహిళల తలరాతలు నీటిమీది రాతలే.
ఇల్లాలయినా, రాజ్యాలేలే నేత అయినా
మగవారి అకృత్యాలతో అణచబడుతూనే వుంది
అసమానతలు ఆంక్షలు నిందలు నిష్టూరాలు
వెరసి స్ర్తీ కోల్పోతోంది స్వేచ్చా స్వాతంత్ర్యం.
ధైర్యాన్ని నేస్తంగా ఉంచుకుని అబల అనే మాట మరచి. సహనమూర్తిగా
చుట్టూ సమస్యల వలయాన్ని చేధించి సాధించి సబలగా నిరూపించు
రక్షించేవారి కోసం నిరీక్షణతో నిరుత్సాహపడక,
ఆదిశక్తిగా అవతారమెత్తి దుష్టశక్తులను అణచి వెయ్య వమ్మా..!!
- వాణి కొరటమద్ది.
.....బాపు బొమ్మలు.....
నుదుట పాపిట బొట్టు నొసట కుంకుమ బొట్టు
నల్లటి కాటుక దిద్దిన చారెడేసి కళ్ళు
ముత్యపు ముక్కెర ముక్కుకు తొడిగి
చెవులకు వేలాడుతూ జుంకాలు సాంప్రదాయంగా,
మెడనింపు చేస్తూ ముత్యాల మాల
అందాన్ని అద్వతీయం చేస్తూ పట్టు పరికిణీలు
నిండుతనం నింపు ఓణీలు
ఎర్రని గోరింట చేతులు గల గల మంటూ మట్టి గాజులు
పారాణి పాదాలుకు సవ్వడి చేస్తూ అందియలు
వాలు జడ సొగసులకు జడకుచ్చుల సొబగులు
పొడవాటి జడకు పొందికగా పువ్వులు
పల్లెపడచులు నండూరి ఎంకి రూపాలు
బాపు బొమ్మల్లో తెలుగు అందాల నాయికలు
తెలుగుతనం వుట్టిపడే కూచిపూడి నృత్యాలు
మనసు కట్టి పడేసే భామా కలాపాలు
అధునిక వస్త్రధారణ పోకడలు అల్లుకుంటున్నా
తెలుగుతనం నింపుకున్నపూబోణీల అందమే అధ్వితీయం
తెలుగింట నడయాడు అపరలక్ష్మీ దేవీ రూపాలు
చూపు మరల్చలేని అందాల బొమ్మలు తెలుగమ్మాయిలు ...!!
...వాణి
నిరీక్షిస్తూ...నింగివంక చూస్తున్నా.
తారలలోనైనా తచ్చాడుతూ కనిపిస్తావేమోనని...!
.
నిన్నoదుకోవాలనే ఆరాటంలో
మరో లోకానికి దారులు వెతుకుతున్నా ...!!

ఊయలలో
అపురూప సుందరి
పండువెన్నెలలో
పరసింప చేస్తూ
ప్రకృతి అందాలతో
పోటీ పడుతూ
సెలయేటి సవ్వడులతో
కూనిరాగాల తీస్తూ
ప్రియునికై వేచి వున్న
అభిసారికలా
విరుల అందాలు
ఆతడికి వలపు సంకెళ్ళు
తరగల నగవుల ఆహ్లాదాలతో
విభునిపై మరులు చెందుతూ
ఊహల తీరంలో విహరిస్తూ
వేచివున్న సుందరాంగి
అందాల జవ్వని...!!

....వాణి

.....కదనరంగాన మహిళలు.........
సుకుమారులే సహన శీలులే సాహసవంతులే
సాటి రారెవరూ అంటూ మేటి అయ్యారు స్త్రీలు

అనాదిగా దగా పడ్డ గత చరిత్ర తిరగరాసి
వీరవనిత లైనారు ధీరత్వం చూపుతున్నారు
అత్మరక్షణ అధిగమించి దేశరక్షణకై నడుంబిగించి
శారీరక అవరోధం ఆటంకం కాదని నిరూపించి
కదన రంగంలోనూ పాదం మోపి
భావి భారత నిర్మాణానికి బాసటగా నిలుస్తూ
తన ధైర్యం తనస్తైర్యం సైన్యంలో చూపిస్తూ
దేశానికి నీవంతు సహకారం అందిస్తూ
కూతురివై తల్లివై భార్యవై ఆబాద్యతా విస్మరించక
జై హింద్ జై భారత్ అంటూ నినదిస్తూవున్నావు...!!
....వాణి కొరటమద్ది, 12.DEC 14

......కలం..........
చేయూతనిచ్చే స్నేహంగా
దూరాన్ని దగ్గర చేసే చెలిమిగా
మది గాయాలకు మమత పంచే తోడుగా
దు:ఖాన్ని పోగొట్టే మంత్రంగా
భావాలకు అలంకరణ మౌతూ
కన్నీరు తుడిచే నేస్తం కలం
రచయితలకు నేస్తమై
రాజీకీయాలకు అస్త్రమై
మరుగైన మానవ సంబంధాలను
దిగజారే విలువలను ప్రశ్నిస్తూ
సమాజాన్ని ప్రశ్నించే ఆలంబన కలం
ఆకట్టుకునే చిత్రాలు
గుండె పగిలే వాక్యలు కలానికేగా సాధ్యం
ఆలోచనలు అక్షరాలుగా
జ్ఞాపకాలను స్పందనలుగా మారుస్తూ
అనుభూతలు అనుభావాలు ఆవేదనలు
ఒలికించే పదాలు ప్రకటించేది కలం
కన్నీళ్ళు ఒలికించినా
హాస్యాన్ని పలికించేది
ప్రేమను పలికిస్తూ
పౌరుషాన్ని రగిలిస్తూ
ఆవేశాన్ని వెల్లడిస్తూ
ఆక్రోశాన్ని వెళ్ళగ్రక్కుతూ
కత్తి కన్నా గొప్పదే కలం....!!
....వాణి కొరటమద్ది
28 nov 14
... ఎందుకలా...!...
అప్పటి దాకా అవన్నీ రహస్యాలే
ఏడడుగుల నడవగానే
మర్మాలన్నీ నీవై పోయాయ్
మనసులోని ఊసులన్ని నీ సొంతమే
ఏదో ఆశ తన కోసమే నువ్వని
అలనాటి జ్ఞాపకాలే నీతో పంచుకుంటూ
ఎంత ఉత్సాహం కొత్త కళే తనలో
ఇద్దరి కలయిక నమ్మకమనుకుంది
అదే తన అసహాయత
సాధించానన్నసంతృప్తి కొంత కాలమే
తెలియని అసలు రూపం
నీలో దాచుకున్న కర్కశత్వం
బలి చేస్తానన్న ఆశల రూపాన్నీ
ఎలా రక్షించాలని
ఉమ్మి నీటిలో బజ్జున్న గుడ్డును ఎలా కాపాడాలి?
భయంగా ముడుచుకున్న చిట్టితల్లిని
బయటకెలా తీసుకురావాలి
ఆరగించే చూపులనుండి ఆవహించే చేతుల నుండి
ఎలా రక్షణ నివ్వను
ఎంత చదువుకున్న మూర్ఖుడవు కదూ నువ్వు
మలినమైన మనసుతో
నేనంటే ప్రాణమంటావ్
నాలోని ఆడబిడ్డను మాత్రం వొద్దంటావ్
ఆడతనంతోనేగా నువ్వు బయటకు విసిరివేయబడ్డావ్
అంత ద్వేషంతో అమ్మా అని ఎలా పిలుస్తున్నావ్?

.....వాణి
//తారాదీపం//
ఆరిన జీవితం ఆరోజున
వెలుగుతోంది దీపం
ముందు గదిలో ఓ మూలన
వడపోసిన జీవిత అనుభవం
వాడ్చేసిన ముసలిన తనం
పరదేశం నుండి వాలిన పుత్రులు
ఆమె ఊపిరి ఉగ్గదీసి ఏడుస్తూ
వెంట తిసుకుపోలేని
ఆస్తుల తగవులాట వీక్షిస్తూ
సంకట స్థితి తల్లి సమస్య వారికి
దీపం ఆరేలోగా
తనూ ఆరిపోవాలని
వెలుగుతున్న దీపాన్ని చూస్తూ ఆమె
ఆయన ప్రక్కే తారాదీపం అవ్వాలని...!!

.....వాణి

//ఆమె//
//నిర్లక్ష్యానికి గురౌతున్న కొందరితల్లుల వేదన చూసి ...//
మరో జన్మే తనకది
మృత్యువు అంచులదాకా వెళ్ళాలని తెలుసు
నిన్ను వొద్దనుకోలా
పoటిబిగువన బాద భరించి
ప్రపంచంలోకి నిను తీసుకొచ్చింది


వ్యర్ధాలను శుద్ది చేయాల్సివస్తుందని అసహ్యించుకోలా
ఆయాలను పెట్టి చేతులూ దులుపుకోలేదు
పవిత్ర బాధ్యతగా స్వీకరించి తృప్తి పడ్డది ఆమె

చిన్న చితకా దగ్గు జలుబు కేర్ కేర్ మని ఏడుస్తుంటే
నిద్దురలేని రాత్రులు ఎన్నోఅపుడూ విసుగులేదు
వసారాలో నిన్ను వొదిలెయ్యలేదు ఆమె

నడక వొచ్చేదాకా చంక నెత్తుకుని
బడికి కెళ్ళినపుడు పుస్తకాలు మోస్తూ
నీ బ్రతుకుబాటకు పునాదులేస్తూ
నువ్వో ప్రపంచంగా నీవే లోకంగా జీవించిన ఆమె

నేడు వేలాడుతున్న కొమ్మ పండిపోతున్నా ఆకు
వడలుతున్న కుసుమం ఊగిసలాడుతున్న దీపం
ఆ కొమ్మకు అండ కావాలి
పండుతున్న ఆకును పట్టుకోవాలి
వడలుతున్న కుసుమానికి చల్లతనాన్ని(ప్రేమ) ఇవ్వాలి
ఆ దీపం ఆరకుండా నీ చేతులనే అడ్డు పెట్టాలి

అనుభవాల ఖజానా ఆమె
ఎన్నో నేర్పించగల గురువు ఆమె
ఆమె మనుమలను ముద్దాడే ఆదృష్టాన్నివ్వు
బామ్మ చెప్పే కధలు వింటూ
మురిసిపోయే నీ సంతానం అందాన్నిచూడు
ఆశ్రమాలకు అంకితం చేయకు

కాకుంటే! రేపు నీవు అంతే వచ్చే వార్ధక్యం
నీకూ ముందరి ముసళ్ళ పండుగే...!!
....వాణి కొరటమద్ది
20 nov14
Unlike · ·
......కన్నీళ్ళు........
మెరిసే ఆ కన్నీటి చుక్క
వెనుక వేదనెంత దాగుందో
కనులు కురిపించే అశ్రువులు
మానని గాయాల జ్ఞాపకాలు

మనసు గాయాలను
వెలికి చూపే సాక్షాలే కన్నీళ్ళు...

ఒలికే ఆ కన్నీటి చుక్క ..
మనసుకు ఎంత ఓదార్పో
రాలుతున్న కన్నీళ్ళు
మదిగదిలోదాగున్న
వేదనకు ఆనవాళ్ళు
వేదన వొలికిపోతుందో లేదో
నేల రాలే కన్నీళ్ళు శిధిలమౌతున్నాయి
మది గాయం మానకున్నా
చుక్కలై ప్రవహిస్తూ రెప్పల్లోనించి
గుండె దాచుకోలేక కన్నీళ్ళు....!!
....వాణి కొరటమద్ది

Friday, January 9, 2015

.........అపుడు అమ్మలా........

కట్టలు తెంచుకున్న దు:ఖాన్ని
ఆపే ప్రయత్నం ఆమెది

వెల్లువెత్తిన కన్నీటిని
తుడుస్తూనే వుంది

గండిపడ్డ గుండె
ఇసుక మూటలౌతున్నాయ్
ఆమె చేతులు

గోడలు కట్టినా ఆగని
కన్నీటి ప్రవాహం

మింగుడు పడని కన్నీళ్ళు
పేగులు మెలిపెడుతూ గాయం

పచ్చి గాయం మీద
స్పిరిట్ పోస్తున్నట్లు
కొందరి మాటలు

మానని గాయానికి
మందు రాస్తున్నట్లు
వారి ప్రవర్తన

హత్తుకోవాల్సిన గుండెను
అవహేళన చేస్తున్నట్లు భావన

కన్నీరే మింగుడు పడని కడుపుకి
చెంత లేని తల్లిని తలపిస్తూ
మండుతున్న పేగుకి
ఆకలి తీర్చాలనే
ఆమె ప్రయత్నం

హత్తుకున్న అక్క
అపుడు అమ్మలా అనిపించింది....!!


.........వాణి

.....నీ కోసం.......
మనసు నీ కోసం పరిభ్రమిస్తూనే వుంటుంది
గతించిన కాలాన్ని లెక్క వేస్తూనే వుంటుంది
ఆశల పల్లకీ లో నుండి జారి పడిపోయాను
జీవిత నడకను సాగిస్తూనే వున్నాను
రాలి పడ్డ చిరునవ్వులు ఏరుకోవాలని..
విఫలమైపోతున్నా ప్రయత్నల్లోనూ..
సానుభూతి సమీరాల్లో భాష్పాలు ఒలబోస్తూ
ఓదార్పు పవనాల్లో కన్నీళ్ళు ఆరబెడుతున్నా
విరక్తి నవ్వులతో విసురుకుంటున్నాను
వెంట వచ్చే వేదన వెక్కిరిస్తూనేవుంది
విదిలించుకు ముందుకు సాగేంత
చిన్నదేం కాదుగా గాయపడ్డ జ్ఞాపకం...!!
వాణి
తెలుగు గజల్.....6
తూ ర్పులోన గున్నమావి పూసినట్లు ఉందిలె
సింధూరపు గంధమేదొ పూసినట్లు ఉందిలె
పొద్దుపొడుపు కిరణస్పర్స విచ్చుకుంటు సుమాలూ
వికసించిన కుసుమాన్నై మురిసినట్లు ఉందిలె
మౌనించిన మనసులోన భావాలు సందడి చేస్తే
కవనంలో అక్షరమై ఇమిడినట్లు ఉందిలె
చిరుజల్లులో చిన్నారుల చిందులాట సంబరమే
మనసంతా బాల్యంలో మెరిసినట్లు ఉందిలె
పసిపాపడి బోసినవ్వు ముచ్చటగా చూస్తుంటే
అమ్మవడిన చిన్నారినై ఆడినట్లు ఉందిలె...!!
.....కొరటమద్ది వాణి
........మధురస్మృతులు......
'మ'నసు నిండిన మౌనాలు
'మ'దిన దాచుకున్న భావాలు
'మ'మత పంచే అక్షరాలు
'మ'మకారపు నేస్తాలు
'మ'రలి పోయిన వత్సరం
'మ'ధురానుభూతుల మయం
'మ'రపురాని జ్ఞాపకాలతో
'మ'రువలేని స్నేహితుల పరిచయం
'మ'రో ప్రపంచం ముఖపుస్తకం
'మ'ధురస్మృతులు మిగిల్చిన సాహితీ ప్రపంచం
'మ'నందరికీ ప్రియమైందిగా తెలుగు అక్షరం
'మ'న భాషను గౌరవిద్దాం అందరం...!!
....వాణి కొరటమద్ది
........మధురస్మృతులు......
'మ'నసు నిండిన మౌనాలు
'మ'దిన దాచుకున్న భావాలు
'మ'మత పంచే అక్షరాలు
'మ'మకారపు నేస్తాలు
'మ'రలి పోయిన వత్సరం
'మ'ధురానుభూతుల మయం
'మ'రపురాని జ్ఞాపకాలతో
'మ'రువలేని స్నేహితుల పరిచయం
'మ'రో ప్రపంచం ముఖపుస్తకం
'మ'ధురస్మృతులు మిగిల్చిన సాహితీ ప్రపంచం
'మ'నందరికీ ప్రియమైందిగా తెలుగు అక్షరం
'మ'న భాషను గౌరవిద్దాం అందరం...!!
....వాణి కొరటమద్ది
..స్నేహ సంద్రం.......
సముద్రం చెంత చేరతాను
కన్నీళ్ళు తుడవమంటూ
ఒలికించిన నీళ్ళను
దాచలేని కన్నీళ్ళను
ఆవహించుకుంటొంది
అపుడు అశ్రువులకు
ఆత్మీయత అంటుంకుంటుంది
ఓ స్నేహం దొరికినట్లు
అలల నవ్వులను ఆస్వాదించమని
తడుముతూ గిలిగింతలు పెడుతూ
మాటి మాటికీ హత్తుకుంటూ
చుట్టూ తచ్చాడుతూనే వుంది
తోడుగా వున్నానంటూ తరంగం
వెనక్కి వెళుతున్న నన్ను చూసి
మళ్ళీ రమ్మంటూ
ఎగసి పడే అలలతోనే
ఆహ్వానం పలుకుతోoది
వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే వుంటాను
తడిసిన పాదాలను చూస్తూ
కనుల చెమ్మ తుడుచుకుంటాను
మళ్ళీ మళ్ళీ వస్తానని
మనసుతోనే చెప్పుకుంటాను
ఇసుకతో నిండిన కాళ్ళను
మోస్తూ వెళుతున్నాను
అంటి పెట్టుకున్నంత సేపూ
ఓదార్పును అనుభవిస్తాను...!!
....వాణి కొరటమద్ది
............సంబరo..........తెలుగు గజల్ .....7
నేలమ్మను తాకగానే చినుకెంత సంబరమో
మౌనానికి మాటవస్తె మనసుకెంత సంబరమో
అనుభవాల పాఠాలే తొలిగురువు అవుతుంటే
విజయాలే పలుకరిస్తె గెలుపుకెంత సంబరమో
మనసులోని అక్షరాలు స్పందనలే ప్రకటిస్తూ
కవనంలో మురుస్తున్న గుండెకెంత సంబరమో
పచ్చదనం పరచుకున్న అవనిపైని అందాలూ
పరవశించు మానవులా మేనుకెంత సంబరమో
.........వాణి కొరటమద్ది
.......పసిమనసు....
చదువులకై పోరాటమా?
చరిత్ర తిరగ రాసే ప్రయత్నమా?
ఏమిటో? ఆ పసిమనసు ఉబలాటం
చేజారిన చిరునవ్వులు ఏరుకోవాలనో..
గతి తప్పిన మానవ జీవిత గతులను సరి చేయాలనో..
మౌనాలు రాజ్యమేలుతూ..
బలవంతపు బంధాలు
గజి బిజి గా జీవన చిత్రాలు
మానవ విలువల మెరుగులకై
శోధనతో సాధించాలని ఆరాటం
మెరిసేటి చిరునవ్వులు మూసేసి
తీక్షణమై పుస్తక వీక్షణంలో
మమతలు వెతుకుతున్నాడేమో చిట్టితండ్రి
చిలిపితనాలు తాకట్టు పెట్టి చివరకు...!!
............ఆశ............
నిశ్శబ్ధాన్ని మూటకట్టి నిశీధిలో వెతకడం
మౌనంతో మాటాడుతు వెన్నెలకై తడమడం
ఆశల వర్షం కురిపిస్తుందని
ఆకాశం వంక చూస్తున్నపుడు
నిత్యం వెన్నెల విహారం వరించకున్నా
అపుడపుడు మెరుపుల్లా
మైమరపులు కావాలని
చినుకులు రాలినపుడల్లా
చిరునవ్వులు వర్షిస్తే బావుండని
దొసిలి నింపుకుని ఆ నవ్వులు
చెక్కిలికి అతికిoచుకుందామని...!!