Wednesday, November 12, 2014

/హుదుద్//
ఊహకు అందని ఉత్పాతమే హుదుద్
లెక్కకు మించిన మిక్కిలి కష్టమే
మేల్కోని మానవుని పై
ప్రకృతి వికటాట్టహాసం
అనుభవాలు మరచినందుకు
అవధిలేని ఆగ్రహం
అనుక్షణం గరళాన్ని మోస్తూ
ఆక్రమణలు సహిస్తూ
ఖనిజాలకై అన్వేషణలు
కొల్లగొడుతున్న కొoడలు
కొoదరి స్వార్ధానికి
బలి అవుతూ బడుగుజనం
సునామీలు తుఫానులు
మండే సూర్యుడు ఎండుతున్న పొలాలు
కలవరపెడుతూ వాతావరణ మార్పులు
సగటు జీవి బ్రతుకు దుర్భరం
ఆందోళనలే వారి జీవితం
కూలిన గుడిసెలు
కూకటి వేళ్ళతో నేల రాలిన వృక్షాలు
ఎన్నెన్నో చేప్పలేని మూగజీవుల వేదనలు
పరాకాష్టకు చేరిన నష్టం
గతి తప్పిన జీవన గమనం
చేయ్యాలిక జీవన సమరం
....వాణి కొరటమద్ది
12 nov 14

No comments:

Post a Comment