Thursday, November 20, 2014

//బాపు మళ్ళీ పుడితే..//
శాంతిని కోల్పోయిన భారతీయులు
నేడు లేరు నాటి సంఘ సంస్కర్తలు
మళ్ళీ పుడతావా బాపూ?
నీతోతీసుకొస్తావా నాటి మహానుభావులను
మరుగున పడిన సంసృతి సంప్రదాయలు
అనుకరిస్తూ విదేశీవిధానాలు
నీవు ఇష్టపడ్డ ఖాదీ వస్త్రం
కన్నీరు పెడుతోంది ఆదరణ కరువై
మళ్ళీ పుడతావాబాపూ?
స్వదేశీయతను కాపాడేందుకై
శుభ్రతకు ఆదర్శం నీవు
మలినమైపోయింది సమాజం
కలుషితమైపోయింది వాతావరణం
మళ్ళీ పుడతావా బాపూ?
కల్మషాలు కడిగేసెందుకు
ఆడపిల్లలపై అకృత్యాలు
వయసు భేదము లేక
వావి వరసలు మరచి
భరోసా లేదు అబలలకు
మళ్ళీపుడతావా బాపూ?
ధైర్యాన్నిస్తావా ఆడపిల్లలకు
నేతల ఖాతాలు నిండుకుండలు
సామాన్యుడు సామాన్యంగానే వున్నాడు
పేదోడికి నాలుగు వాగ్ధానాలు
మారని జీవిత గతులు
మళ్ళీ పుడతావా బాపూ?
మామూలు మనిషికి మార్గం నిర్ధేశించగ
సత్యం అహింస నీ మార్గాలు
నేడు రాజ్యామేలుతున్నాయి
అందుకు విరుద్ధ సంఘటనలు
మళ్ళీ పుడతావా మహాత్మా?
నీ మార్గాల్లో మము నడిపిస్తావా..!!
.... వాణి కోరటమద్ది

No comments:

Post a Comment