Wednesday, November 12, 2014

/బాపు బొమ్మలు //
గుండె తలపులు తట్టేలా కుంచెతో వర్ణచిత్రాలు విరచించారు
ముగ్ధ స్నిగ్ధ సౌందర్యాల గీతాచార్యుడు

పురాణ చిత్రాలను రేఖల్లో బంధించిన ఆధ్యాత్మికవేత్త
తలెత్తుకు తిరిగే తెలుగక్షరాలకి సొగసులద్దిన రూపశిల్పి
పచ్చని ప్రకృతిసౌందర్యాలను ఆవిష్కరించిన ఘనత
బాపు బొమ్మలు సృజనాత్మకతకు పట్టం కట్టే అద్బుత సంతకాలు
పొడవాటి వాలుజడ పెద్దబొట్టు చారెడేసికళ్ళు అందమైన చీరకట్టు
పదహారణాల తెలుగు భామ బాపు బొమ్మ
ప్రతీ పత్రికను అలరించిన బాపు బొమ్మల రమణీయత
బుడుగు బొమ్మలతో ప్రాణం పోసిన కార్టూన్ బ్రహ్మ బాపు.
శ్రీశ్రీ విప్లవ రచనలకు చలం భావాలకు
ఆరుద్ర కూనలమ్మ పదాలకు అజరామరం బాపు బొమ్మలు
అంతర్గత నిజందాగి తెలుగువారికి నవ్వులు కురిపించిన బాపు బొమ్మలు
సహజమైన ముదురు రంగులతో రూపుదిద్దుకుని మైమరపిస్తాయి
రామాయణ మహాకావ్యం సీతస్వయంవరం రావణ సీత సంవాదం
బొమ్మల సంకలనాలు అవగతం చేసేను ఆయన చిత్రకళలు
తెలుగు సంసృతిని ప్రతిబింబించేబొమ్మలు అందానికి అందంలా మెరిపిస్తూ
తెలుగు వారికి తెలుగు దనాన్నిచిత్రకారులకు చిత్ర కళను
క్రొంగొత్తగా పరిచయం చేసే సృజన శీలి.....!!!
........వాణి కొరటమద్ది
5 sep 14

No comments:

Post a Comment