Wednesday, November 12, 2014

//నాన్న//
ప్రేమ పెన్నిధి భయము భక్తి
అనుభవాల సమ్మేళనం నాన్న
నడక నేర్పి నడత నేర్పి జీవిత పాఠాలు నేర్పి
అడుగడుగునా ఆత్మ విశ్వాసము నింపి
బ్రతుకు బాట వేస్తావు
భవితకు దారి చూపేవు
మా కంట కన్నీరు రాకుండా
నీ కన్నీరు మాకు కనిపించకుండా
కష్టాలు నీవు భరిస్తూ
ఇష్టాలు మాకు అందిస్తూ
మా విజయాలు నీకు ఆనందమై
అపజయాలకు ఓదార్పువై
శ్రమిస్తూ గమ్యాన్నిచూపే
నాన్నంటే నిస్వార్ధ రూపం ఆశల దీపం
బంగారు బాటలో మము నడిపించాలని
ఎన్ని రాళ్ళ బాటలు దాటావో
సుఖాన్నీ మా కందించే ప్రయత్నంలో
ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావో
నాన్నంటే ధైర్యం
భవిష్యత్తుకు మార్గదర్శనం
.....వాణి కొరటమద్ది
11 aug 2014

No comments:

Post a Comment