Tuesday, November 11, 2014

// బాల్యం ఓ మధుర సంతకం//
అమ్మగర్భాననులి వెచ్చదనం
ఒడిలోని కమ్మదనం
పొత్తిళ్ళ పసిపాపకి అపురూప వరం
అమ్మ ఒడి ప్రపంచాన్ని జయించిన ఆనందం

నాన్న వేలు పట్టుకు నడిపించిన ఆ అడుగులు జ్ఞాపకం
అపుడా నడకల్లో ఏదో తెలియని గర్వం
అక్షరాలు దిద్దుతూ గురువుగారి మెప్పులోఅంతేలేని సంబరం
పాఠాలతోపాటునీతి కధలు వింటూ
ఆ నీతిని జీవితాన మరువకూడదనుకుంటూ
మరుపురాని ప్రయత్నాలు మరలరాని అనుభవాలు
కృష్ణానది తీరాన ఏరుకున్న గవ్వలు
అక్కతోపాటు పంచుకున్న నవ్వులు
మదిలో మెదిలే ఆ తలపుల మైమరపులు
చెదిరిపోయిన గుజ్జనగూళ్ళు జ్ఞాపకాలే ఆనవాళ్ళు
అష్టాచెమ్మ తొక్కుడుబిళ్ళ ఆరోగ్యకరమైన ఆటలు ఎన్నో
మనసును ఉల్లాస పరిచే ఊహలు ఎన్నెన్నో
చిరు చిరు పోట్లాటలు పెంకితనాలు
నాన్న మందలింపులు అమ్మ చెంత గారాలు
అనునయ పలుకు అలుక తీర్చే కానుకలు
మరువలేని బాల్య స్మృతులు
అందమైన హరివిల్లులు
తీపి జ్ఞాపకం బాల్యం
ప్రతి జీవితానికి ఓ మధుర సంతకం...!!
....వాణి కొరటమద్ది
31 oct 14

No comments:

Post a Comment