Wednesday, November 12, 2014

నింగి నేల ఏకామవ్వాలన్నట్లు
సంద్రం ఆకాశంతోస్నేహాన్ని కోరుతుంది
అలల హస్తాలతో ఆత్రంగా
ప్రశాంతంగావున్నావని నీ నురగలె గుర్తుగా
మనసంతా ఆహ్లాదం పరుచుకుంది త్రుప్తిగా
సంద్రంపై ప్రసరిస్తూ కిరణాల వెలుగులు
మేఘమై మెరవాలని ఆకర్షిస్తున్నట్లుగా
హద్దులు లేని కోరికలకు నింగి అర్థం చెపుతుంది
అలవికాని ఆలోచనలకు నేల సమాధానం చెపుతుంది
అలుపెరుగని అలను చూసి కొత్తపాఠం నేర్చుకో
ఓటమి ఎదురైనా మున్ముందుకు దూసుకుపో
కెరటం తుడిచేస్తూ పాదాల గుర్తులు
గతం మరచి నడవమని గుణపాఠం చెపుతుంది
కడలి ముందు కూర్చుంటే కలత చెదిరిపోతుంది
మనసు ఓదార్పుకు తరంగం తోడవుతుంది
........వాణి కొరటమద్ది

No comments:

Post a Comment