Tuesday, November 11, 2014

ప్రియమైన చింటూ,
ఎంటో నీ జ్ఞాపకాల్లో నేనెపుడు మునిగి తేలుతుంటాను నీవు లేని తనం నన్నింకా చిత్రహింస చేస్తూనే వుంది నిన్ను గెలుచుకోవాలనే పోరాటంలో జరిగే ఎన్నో అన్యాయాలు చూశాను డబ్బు మయమైన సమాజం ఎంత విలువలు కోల్పోయిందో అవగతం చేసుకున్నాను అలానే కొందరు మానవత్వం వున్న మనుషులను చూశాను అలాoటి వారిని కొoదరు పిచ్చి వాళ్ళుగా జమ కట్టడం అర్ధం చేసుకున్నాను, కొత్త ప్రదేశం పరిచయమే లేదు ఊరు. అలాంటి చోట మా ఇద్దరి పోరాటం నీ కోసం. బంధువులు వొచ్చి పలుకరించిందీ లేదు సహకరించిందీ లేదు అస్తమాను ఫోనులు, కాల్ వొచ్చినపుడల్లా విసిరి కొట్టాలనిపించేది ఎందుకలా ప్రవర్తిస్తారో అర్ధమయ్యేది కాదు కన్నీళ్ళు తప్ప మాలో మరో స్పందన వుండేది కాదు. ఓడిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటే ఎన్ని కన్నీళ్ళో..! ప్రపంచంతో ఫ్రీగా కలవలేక పోతున్నాం. ఓటమి తెలిసిన వాళ్ళందరూ అలానే చూస్తున్నారులే. దారిన పోయే కుక్క తో నైనా అవసర పడుతుందని అందరితో సక్యతగా వుండమని నాన్న చెప్పిన మాట ఎప్పుడూ గుర్తొస్తుంది. నేను అలానే వుండేదాన్ని ఎవరెన్ని అన్నాతిరుగు సమాదానం చెప్పేదాన్ని కాదు వాళ్ళ అంతరాత్మకి తెలుసులే వాళ్ళ తప్పొప్పులని మనసుకు సర్ది చెప్పుకునేదాన్ని. కాస్త పెద్దదయింది కదా పాప ఎందుకమ్మా అలా అంటే నువ్వు ఎమీ మాట్లాడవు అంటూ వుంటుంది తనకి బాధగా వుంటుందేమో నన్ను అన్నారని. వాళ్ళకే తెలుస్తుందిలే అని తనని వూరుకో పెడతాను. కానీ అందరిలో మార్పు మాత్రం బాగా కనిపిస్తొంది అందరి మాటల్లో డబ్బు ప్రాదాన్యత కనిపిస్తుంది నేను కష్టంలో వున్నపుడు ఎక్కడ సాయం చేయాల్సివొస్తుందో అని ముఖం చాటేసిన వాళ్ళే ఇప్పుడు ప్రేమ ఒలక పోస్తున్నారు. డబ్బు మయమైన లోకంలోబంధాలు విలువలు కోల్పోయాయి కదూ ముసలివాళ్ళంటే నీకు ఎంత ఇష్టం కదూ! కానీ ముసలివాళ్ళేఆశ్రమాలపాలై పోతున్నారు తెలుసా! మoచితనం కలిగిన వాళ్ళు ఎక్కువ కాలం జీవిoచరనే మాట పెద్దలు చెప్పినపుడెపుడో విన్నా అది నిజమే అనిపిస్తుంది నీ మంచితనం దేవుడికి నచ్చిందేమో అందుకే నిన్నంత త్వరగా తిసుకెళ్ళీపోయాడు 'అపద్దం చెప్పరాదు' అన్న మాటని అక్షరాల పాటించేవాడివి ఇపుడoతా అపద్దాలతోనే సమాజం గెలుస్తోంది తెలుసా?మరో చోట మంచితనం గెలిచే చోట నీ కోరికలన్నీ తీరే చోట సంతోషంగా వున్నావని సర్ది చెప్పుకుంటున్నా! నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాదు మనసులోది చెప్పుకుంటే కదా రిలాక్సెషన్ దొరికేది.ఏమో ఎలా చెప్పనో చింటూ నా ఫీలింగ్ అంతా అక్షరాలతో చెప్పేసుకున్నా నీ మంచితనాన్ని నీ నిజాయితీని నేనెప్పటికీ మర్చిపోలేను నీజ్ఞాపకాలు నా మనన్సులో ఎప్పుడూ గూడుకట్టుకునే వుంటాయి సరే చిoటూ ఇప్పుడు హాయిగా వుంది నా మనసులోని అక్షరాలన్ని బయటకొచ్చేశాయి.
...అమ్మ

No comments:

Post a Comment