Thursday, November 20, 2014

..స్వయంకృషి...
సంతానం ఎంతమందైతెనేం
కన్న వాళ్ళకి కానిదాన్నయ్య
తాళి కట్టినోడు వొంటరిని చేసినాడు
కాటికి కాళ్ళు చాపుకున్నదాన్నే
కడుపు నింపుకోవాలిగా
పాతపుస్తాకాలు కొనుక్కునే
పిల్లవాళ్ళకి అవసరం తీర్చే అవ్వనయ్యాను
కొoదరు అమ్మితే కొనుకుంటూ
పదో పరకో లాభంతో అమ్ముకుంటూ
దినపత్రికలు వారపత్రికలచదువరులకు
ఆత్మీయురాలి నయ్యాను
బ్రతుకు బండిని నడిపిస్తూన్నా
కూలబడి స్వయంకృషితో
జీవితాన్ని ఈదెస్తున్నా...!!

....వాణి కొరటమద్ది
19 nov14
.......కన్నీళ్ళు........
మెరిసే ఆ కన్నీటి చుక్క
వెనుక వెదనెంత దాగుందో
మనసు గాయాలను
వెలికి చూపే సాక్షాలే కన్నీళ్ళు...
కనులు కురిపించే అశ్రువులు
మానని గాయాల జ్ఞాపకాలు

ఒలికే ఆ కన్నీటి చుక్క ..
మనసుకు ఎంత ఓదార్పో
రాలుతున్న కన్నీళ్ళు
మదిగదిలోదాగున్న
వేదనకు ఆనవాళ్ళు
వేదన వొలికిపోతుందో లేదో
నేల రాలే కన్నీళ్ళు శిధిలమౌతున్నాయి
మది గాయం మానకున్నా
చుక్కలై ప్రవహిస్తూ రెప్పల్లోనించి
గుండె దాచుకోలేక కన్నీళ్ళు....!!
....వాణి కొరటమద్ది
..కార్తీక మాసం -- ఆకాశదీపం....
ఆధ్యాత్మిక చింతన సంసృతి సంప్రదాయం
ఆహ్లాదకరమైన ప్రకృతి ఆరోగ్యం ఆనందం
కార్తీక మాసానికే ప్రత్యేకం
వేకువనే చన్నీటి స్నానాలు
భోళాశంకరునికి నిత్య అభిషేకాలు
శివకేశవ నామస్మరణతో
ప్రతిధ్వనించే ఆలయాలు
దీపాలు లౌకిక అలౌకిక భావనకు వెలుగు రేఖలు
పౌర్ణమి రోజున దేవాలయాల్లో జ్వాలా తోరణాలు
అజ్ఞానాన్ని తొలగించే జ్యోతులు సర్వపాపహరణాలు
వృక్షాల సంరక్షణకై నిగూఢ సందేశం వనసమారాధన
ఉసిరి చెట్టు కిందే సామూహిక వనభోజనాలు
హరిహరులకు కార్తీకం అంత్యంత ప్రీతికరం
బిల్యార్చనతో మారుమ్రోగు దేవాలయాలు
అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు
జిల్లేడు పూలు మారేడు దళాల పూజ శ్రేష్టం
కార్తీక శుక్లపక్ష చవితి నాగులచవితి పర్వదినం
చిలుక ద్వాదశి (క్షీరాబ్ధి)రోజున క్షీరసాగరమదనం
శ్రీమహావిష్ణువువివాహం తులసి కోటను పూజించడం
పుణ్య నదీ స్నానాలు అరటిదొప్పల దీపాలు
నీటిలోకనువిందుచేసే దీపకాంతులు
ఆహ్లాదపరచే దృశ్యం
....వాణి కొరటమద్ది
.............బాలల దినోత్సవ శుభాకాంక్షలు........
//పిల్లలం//
చిన్నారులం చిన్ని నవ్వులం
భావి భారత వెలుగులం
చిగురించే చిరునవ్వులం
వికసించే పువ్వులం

పెద్దలు మంచి బాటలు వేస్తే
ఆ బాటల్లో మేము నడిచోస్తాం
నవ్య భారతాన్నీనిర్మిస్తాం
క్రొత్త వెలుగులు పూయిస్తాం
పండుగలన్నీ మాకు సందడులే
అంబరమంత సంబరమే
ప్రతి కుటుంబానికి దీపాలం
ప్రగతికి మేము సోపానం
....వాణి కొరటమద్ది
14 nov 14
/దారిద్ర్యం//
చెత్తకుప్పల చెంత చేరుతున్న
చిన్నారులు దారిద్ర్యానికి నిలువెత్తు సాక్ష్యాలు
పేదరికం ఆహారలోపం ఆదరణ కరువైన అభాగ్యులు
ఆచరణకు నోచుకోని ప్రాధమిక హక్కులు
మిన్నంటిన ధరలు మాడుతున్న కడుపులు
దిక్కుతోచక వారి ధౌర్భాగ్య స్థితులు
భారతీయులందరూ మన సహోదరులన్నాo
భరతమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేశాం
నా దేశాన్ని ప్రేమిస్తున్నామన్నవారే
పరాయి దేశాన సొమ్ము దాచుకుంటున్నారు
దారిద్ర్యం తాండవిస్తూనే వున్నాధనవంతుల
ఖజానాలే నిండుతున్నాయ్
మరి నవ్య భారతదేశ నిర్మాణo ఎప్పుడో...?
....వాణి కొరటమద్ది
13 nov 14
//బాల కార్మికులు//
ఆ కన్నుల్లో కన్నీళ్ళెందుకు
కోటి ఆశల వెలుగులు విరజిమ్మాలి కదా?
కలం పట్టాల్సిన చేతులు
ఇటుకలు మోస్తూ కంది పోతున్నాయి
కడుగుతున్న టీ కప్పుల్లో
అక్షరాలు వెతుకుంటున్నాయి
మూటలు మోస్తూ
భుజాలు బావురుమంటున్నాయి
వెన్నుతట్టె మాష్టారి మెచ్చుకోలుకోసం
తపించిపోతున్నాయి
తలపై తట్టలు మోస్తూ
తల్లడిల్లిపోతున్నారు
బుర్రల్లో జ్ఞానాన్ని నింపమని
వేడుకుంటున్నారు
పుస్తకాలు మోస్తూ
బడి గడప తొక్కాలికదా?
గడప గడప తిరిగి
పేపర్లు పంచుతున్నాయి
కంప్యూటర్లు కదిలించాల్సిన వేళ్ళు
చెత్తకుప్పల్లో సీసాలు ఏరుతున్నాయి
చిరునవ్వులు చిందాల్సిన బాల్యం
చిత్కారాలు ఎదుర్కొoటోంది
నవ్య భారత నిర్మాతలు వాళ్ళు
నిర్లక్ష్యానికి నిదర్శనమౌతున్నారు
....వాణి కొరటమద్ది
17 nov14
.....ఆశాజీవులు...
గుడిమెట్లె ఇల్లౌవుతూ
ఫుట్పాత్లే పానుపులై
స్వేచ్చగా తిరుగుతున్న
నిర్లక్షపు సాక్షాలం

కల్మషమే లేదుగా
కడుపునిండితే చిరునవ్వులే
బడి బాటలు లేకున్నా
బ్రతుకు బండి నడిపిస్తూ
పుస్తకాలు లేకున్నా
అనుభవాలు చదివేస్తూ
కన్నీళ్ళు దాచుకుంటూ
నవ్వులు నటిస్తూ
అమ్మ వొడి దూరమైనా
అవని తల్లి హత్తుకుంది
నారుపోసేవాడు నీరుపోస్తూ
ప్రసాదాలతో పొట్ట నింపుకుంటూ
అక్కున చేర్చుకునే
ఆత్మీయులకోసం
రేపటి నవ్వుల కోసం
ఆశాజీవులం...
.......వాణి
//బాపు మళ్ళీ పుడితే..//
శాంతిని కోల్పోయిన భారతీయులు
నేడు లేరు నాటి సంఘ సంస్కర్తలు
మళ్ళీ పుడతావా బాపూ?
నీతోతీసుకొస్తావా నాటి మహానుభావులను
మరుగున పడిన సంసృతి సంప్రదాయలు
అనుకరిస్తూ విదేశీవిధానాలు
నీవు ఇష్టపడ్డ ఖాదీ వస్త్రం
కన్నీరు పెడుతోంది ఆదరణ కరువై
మళ్ళీ పుడతావాబాపూ?
స్వదేశీయతను కాపాడేందుకై
శుభ్రతకు ఆదర్శం నీవు
మలినమైపోయింది సమాజం
కలుషితమైపోయింది వాతావరణం
మళ్ళీ పుడతావా బాపూ?
కల్మషాలు కడిగేసెందుకు
ఆడపిల్లలపై అకృత్యాలు
వయసు భేదము లేక
వావి వరసలు మరచి
భరోసా లేదు అబలలకు
మళ్ళీపుడతావా బాపూ?
ధైర్యాన్నిస్తావా ఆడపిల్లలకు
నేతల ఖాతాలు నిండుకుండలు
సామాన్యుడు సామాన్యంగానే వున్నాడు
పేదోడికి నాలుగు వాగ్ధానాలు
మారని జీవిత గతులు
మళ్ళీ పుడతావా బాపూ?
మామూలు మనిషికి మార్గం నిర్ధేశించగ
సత్యం అహింస నీ మార్గాలు
నేడు రాజ్యామేలుతున్నాయి
అందుకు విరుద్ధ సంఘటనలు
మళ్ళీ పుడతావా మహాత్మా?
నీ మార్గాల్లో మము నడిపిస్తావా..!!
.... వాణి కోరటమద్ది
//ఆమె//
//నిర్లక్ష్యానికి గురౌతున్న కొందరితల్లుల వేదన చూసి ...//
మరో జన్మే తనకది
మృత్యువు అంచులదాకా వెళ్ళాలని తెలుసు
నిన్ను వొద్దనుకోలా
పoటిబిగువన బాద భరించి
ప్రపంచంలోకి నిను తీసుకొచ్చింది

వ్యర్ధాలను శుద్ది చేయాల్సివస్తుందని అసహ్యించుకోలా
ఆయాలను పెట్టి చేతులూ దులుపుకోలేదు
పవిత్ర బాధ్యతగా స్వీకరించి తృప్తి పడ్డది ఆమె
చిన్న చితకా దగ్గు జలుబు కేర్ కేర్ మని ఏడుస్తుంటే
నిద్దురలేని రాత్రులు ఎన్నోఅపుడూ విసుగులేదు
వసారాలో నిన్ను వొదిలెయ్యలేదు ఆమె
నడక వొచ్చేదాకా చంక నెత్తుకుని
బడికి కెళ్ళినపుడు పుస్తకాలు మోస్తూ
నీ బ్రతుకుబాటకు పునాదులేస్తూ
నువ్వో ప్రపంచంగా నీవే లోకంగా జీవించిన ఆమె
నేడు వేలాడుతున్న కొమ్మ పండిపోతున్నా ఆకు
వడలుతున్న కుసుమం ఊగిసలాడుతున్న దీపం
ఆ కొమ్మకు అండ కావాలి
పండుతున్న ఆకును పట్టుకోవాలి
వడలుతున్న కుసుమానికి చల్లతనాన్ని(ప్రేమ) ఇవ్వాలి
ఆ దీపం ఆరకుండా నీ చేతులనే అడ్డు పెట్టాలి
అనుభవాల ఖజానా ఆమె
ఎన్నో నేర్పించగల గురువు ఆమె
ఆమె మనుమలను ముద్దాడే ఆదృష్టాన్నివ్వు
బామ్మ చెప్పే కధలు వింటూ
మురిసిపోయే నీ సంతానం అందాన్నిచూడు
ఆశ్రమాలకు అంకితం చేయకు
కాకుంటే! రేపు నీవు అంతే వచ్చే వార్ధక్యం
నీకూ ముందరి ముసళ్ళ పండుగే...!!
....వాణి కొరటమద్ది
20 nov14

.........సాగరం..........
ఎగసిపడే అలల అందాలతో
ఆహ్లాద పరిచే ప్రశాంత సాగరం
పర్వతాల్లో ఎక్కడొ పుట్టి
ప్రవాహంలో ఏదురయ్యే
నదీ నదాలను కలుపుకుంటూ
తన పరవళ్ళ నవ్వులతో
పరిధిలోని పరిసరాలను
నందనవనం చేస్తూ
కనువిందు చేసే కడలి అందం
కవుల కల్పనకు
ఆత్మీయ నేస్తంగా
ఒంటరి తనానికి తోడుగా సంధ్రం
తనలో దాగి వున్న
సుడిగుండాలు సునామీలు
ఒక్కోసారి ఉధృతమౌతూ
ఆటు పోట్లను
సంసారం సాగరాన్ని తలపిస్తూ
సుఖదు:ఖాలనూ సూచిస్తూ
జీవితానికి అర్ధం చెపుతూ సాగరం..!!

...వాణి కోరటమద్ది
18 nov 14

Wednesday, November 12, 2014

//కృష్ణయ్య//
కృష్ణయ్య నిను చూసి
కనులు విప్పారక వుండునా
మనసులోని బాదంతా
చెప్పాలని వుండదా

కన్నయ్య నీ మహిమలు
చూసి అచ్చెరువే పొందనా
భక్తితో నీకు దండాలే
పెట్టాలని వుండదా
బృందావనం చూసెందుకు
మనసు ఉవ్విళ్ళూరు తుందిగా
నీవు నడయాడిన ప్రదేశాన్ని
స్పృసించాలని వుండదా
మాధవుని మురళీ గానం
రంజిల్లు తుందిగా
తన్మయత్వంతో మనసంతా
తుళ్ళి పడుతుందిగా
కృష్ణా కృష్ణా అంటూ
నీ నామమే నిండుగా
మనసంతా భక్తిమునిగె
నీ మీదే మెండుగా
మధురలో అడుగులేసి
మైమరచాలని వుందిగా
మార్గమే చూపించు
నీ చెంత చేరగా...!!
వాణి కొరటమద్ది
11 aug 2014
సేద తీరని స్వేదం రైతన్నకు దక్కని శ్రమఫలం...!!
.....వాణి కొరటమద్ది
మది చాటున మానని గాయాలైనా కళ్ళని తడవని చెలమలు...!!
//నాన్న//
ప్రేమ పెన్నిధి భయము భక్తి
అనుభవాల సమ్మేళనం నాన్న
నడక నేర్పి నడత నేర్పి జీవిత పాఠాలు నేర్పి
అడుగడుగునా ఆత్మ విశ్వాసము నింపి
బ్రతుకు బాట వేస్తావు
భవితకు దారి చూపేవు
మా కంట కన్నీరు రాకుండా
నీ కన్నీరు మాకు కనిపించకుండా
కష్టాలు నీవు భరిస్తూ
ఇష్టాలు మాకు అందిస్తూ
మా విజయాలు నీకు ఆనందమై
అపజయాలకు ఓదార్పువై
శ్రమిస్తూ గమ్యాన్నిచూపే
నాన్నంటే నిస్వార్ధ రూపం ఆశల దీపం
బంగారు బాటలో మము నడిపించాలని
ఎన్ని రాళ్ళ బాటలు దాటావో
సుఖాన్నీ మా కందించే ప్రయత్నంలో
ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావో
నాన్నంటే ధైర్యం
భవిష్యత్తుకు మార్గదర్శనం
.....వాణి కొరటమద్ది
11 aug 2014
/ హిజ్రా/
బృహన్నల జాతి వారసత్వం
అర్ధనారీస్వర తత్వం
అంకురంలోనే తేడా
శరీర సంఘర్షణ
పురుష శరీరంలో
ఇమడలేని ఆడతనం
గే లుగా చూడబడుతూ
గుర్తింపు లేని జీవితాలు
తమది కాని నేరానికి
సమాజం వెలివేసిన వారు
అమ్మ నాన్నలకే పుట్టి
అనాధలైపోతున్నారు
హిజ్రా అంటే తిరస్కారoనిరాదరణకు పర్యాయపదం
అవహళనల నడుమ సాగే జీవితం
న్యాయస్థానాన గెలుచుకున్న హక్కులతో
సమాజంలోనూ వారికి సరైన సహకారం కావాలి
.....వాణి కొరటమద్ది
11 aug 2014
//వర మహా లక్ష్మీ వ్రతం//
సిరితల్లి శ్రీమహాలక్ష్మి లోకాలను అలరించే శ్రావణం మాసం
వరాలు వర్షించే శ్రావణం వరలక్ష్మీ వ్రత కాలం

వాకిళ్ళలలో తీర్చిదిద్దిన రంగవల్లులు
గుమ్మాలకు పసుపుకుంకుమలు మామిడితోరణాలు
ఆహ్వానం పలుకుతూ ఐశ్వర్యదాయినికి
ధర్మబధమైన వాంచలను నెరవేర్చేకార్యం జగన్మాత వాత్సల్యం
కోరిన వరాలనిచ్చే కొంగు బంగారం
చారుమతి ఆచరించెను మెదటగా వరలక్ష్మీవ్రతం
దేవీ కటాక్షానికి నోచుకున్న వ్రతకధ సందేశంగా
కలశమందు లక్ష్మీ దేవి ఆవాహనం షోడషోపచారములతో పూజించడం
తొమ్మిది సూత్రాల తోరాలు ధరించడం తొమ్మిది రకాల పిండి వంటలు నివేదించడం
వికశించిన పుష్పంలో ఆసీనమై కుడి ఎడమ చేతుల్లో ఆనంద జ్ఞాన వికాస పద్మాలు
అందరికీ లక్ష్యమైన ఐశ్వర్యం ఆనందాల రూపమే వరలక్ష్మి
వరం నెరవేరడమే ఐశ్వర్యం వరాలు వర్షించే శ్రావణం వరలక్ష్మీ వ్రతకాలం
....వాణి కొరటమద్ది
13 august 2014
//భూమి (పృథ్వీ)//
పంచభూతాత్మక మైన ప్రకృతి బ్రహ్మండం
పంచ భౌతికమైన శరీరం పిండాండం

అద్భుత అందాల పుడమి తల్లి
మంచుకొండలు సెలయేళ్ళు లోతైన సముద్రాలు
పర్వతాలు కొండలు పచ్చని చెట్లు
పక్షుల కిల కిల రావాలు
భూమాత ఒడిలోనే ప్రకృతి సౌందర్యం
సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ
ప్రకృతి విలువలను సమకూరుస్తూ
అంతర్భాగాన గనులు ఖనిజ లవణాలు
మానవుని నిరంతర పరిశోధనలు అన్వేషణలు
జీవన చక్రం ప్రశ్నార్ధకంగా మనుగడకు ముప్పుగా
జల వాయు శబ్ధ కాలుష్యకోరలు
ధరిత్రి ఒడిలో అంతరించి పోతూ జీవరాశులు
పెరిగిపోతూ ఆకాశ హర్మ్యాలు
అడుగంటుతూ నీటి నిల్వలు
కర్మాగారవ్యర్ధాలు కలుషితాలై అనారోగ్యానికి కారణమౌతూ
రక్షణ కవచమైన ఓజోను పొర చిరిగిపోతూ
అవనిపచ్చదనాన్ని కోల్పోతూ జీవకోటి వునికికే ప్రమాదం
అవని అందాలు కాపాడుకుందాము
వృక్షసంపదను పెంచుకుందాము
మానవులు పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాలి
చేయి చేయి కలిపి భావితరాలకై
భూగోళ రక్షణ తక్షణ కర్తవ్యమవ్వాలి...!!
....వాణి కొరటమద్ది
22 august 2014
.ఉదయాన్ని ఊరడిస్తూ నిన్నటి కన్నీటి జ్ఞాపకాల్ని తుడిచేస్తూ...!!
ఎంతటి దివ్య దృష్టో మరపు మంత్రాన్ని ప్రసాదించిన దైవ లీలలు ...!!
నాలుగు నవ్వుల్ని కోసుకు రావూ వేదన నిండిన మనసులకి పంచిపెడదాం...!!
మదిలోని బాధంతా భావమై పోతోంది...
అక్షరాల్లో కన్నీరై ప్రవహిస్తూ వుంటుంది..!
కనుమరుగైన రూపాన్ని అక్షరాలుగా మారుస్తున్నా...
ఆవిరైన ఆనందాల్ని.. అశ్రునయనాలతో శోధిస్తున్నా...!!
చిగురిస్తున్న ఆశలు చితిపైవాలాయి..
చిరువ్వులు చింతలుగా మిగిలాయి...!!
మాసిపోదు మనోగతం మది చేరదు ఆశాకిరణం ...
చెరిగిపోని చేదునిజం చేరువవదు చిరుదీపం...!!
తెలుగు సోయగం చిన్నబోయింది ... వన్నెలద్దిన కుంచె మరలి వెళ్ళిందని...!!
బాపు స్పర్శదూరమైన బొమ్మ .. కుంచెతాకని అందం..!!
చిన్న బోయిన బాపు గీతలు ...లేని రమణ రాతలకి సాక్షిగా...!!
గీత మారిందిలే ఇక.. స్వర్గంలో కొత్త అందాలు సృష్టంచాలని స్నేహాన్ని చేరి...!!
పెళ్లిపుస్తకంలో ముత్యాల ముగ్గు .. సీతా కల్యాణం సాక్షిగా...!!
నింగి నేల ఏకామవ్వాలన్నట్లు
సంద్రం ఆకాశంతోస్నేహాన్ని కోరుతుంది
అలల హస్తాలతో ఆత్రంగా
ప్రశాంతంగావున్నావని నీ నురగలె గుర్తుగా
మనసంతా ఆహ్లాదం పరుచుకుంది త్రుప్తిగా
సంద్రంపై ప్రసరిస్తూ కిరణాల వెలుగులు
మేఘమై మెరవాలని ఆకర్షిస్తున్నట్లుగా
హద్దులు లేని కోరికలకు నింగి అర్థం చెపుతుంది
అలవికాని ఆలోచనలకు నేల సమాధానం చెపుతుంది
అలుపెరుగని అలను చూసి కొత్తపాఠం నేర్చుకో
ఓటమి ఎదురైనా మున్ముందుకు దూసుకుపో
కెరటం తుడిచేస్తూ పాదాల గుర్తులు
గతం మరచి నడవమని గుణపాఠం చెపుతుంది
కడలి ముందు కూర్చుంటే కలత చెదిరిపోతుంది
మనసు ఓదార్పుకు తరంగం తోడవుతుంది
........వాణి కొరటమద్ది
అధరాలు జాలువార్చే ముత్యాల పదాలు..
సంగీత సరస్వతి ఒలికించే గమకాలు....!!
అమ్మన్న పిలుపు అధరాల కలయిక..
బిడ్డ తల్లికిచ్చిన అపురూపమైన తొలికానుక...!!
సంప్రదాయాన్ని మరచి ఆధునికత పోకడలో ...
వసివారుతున్న అతివల అధర సౌందర్యం...!!
కన్నీళ్ల ఖర్చులో...మనసు గాయం మానడం లేదు...!!
జ్ఞాపకాల నిట్టూర్పులు మదిదాటని భావాలు
ఆరిపోని ధు:ఖాలు ఆగిపోని బాష్పాలు
// ఆమె చెయ్యి //
పసిబిడ్డగా వున్నపుడు ముద్దాడిన ఆ చెయ్యి
గోరు ముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసింది
తట్టలే మోసిందో కట్టెలే కొట్టిందో
గుండెలకి హత్తుకుని ఎంతగారం చేసిందో
శ్రమ ఎంత పడ్డదో ఎవరికి ఎంత సేవ చెసిందో
చేవ లేక చతికిల పడ్డది
సాగి సాగి ముడతలు పడ్డది
సత్తువ లేక సాయం కావాలంటొంది
దేహీ అంటూ బిక్షమెత్తుకుంటోంది
బ్రతుకు కష్టమంతా ఆ చెయ్యిలో కనిపిస్తూ
కార్చిన కన్నీళ్ళన్నీ ఆముడతల్లో కనిపిస్తూ
నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిర్జీవంగా ఆ చెయ్యి
....వాణి కొరటమద్ది
10 nov14
/హుదుద్//
ఊహకు అందని ఉత్పాతమే హుదుద్
లెక్కకు మించిన మిక్కిలి కష్టమే
మేల్కోని మానవుని పై
ప్రకృతి వికటాట్టహాసం
అనుభవాలు మరచినందుకు
అవధిలేని ఆగ్రహం
అనుక్షణం గరళాన్ని మోస్తూ
ఆక్రమణలు సహిస్తూ
ఖనిజాలకై అన్వేషణలు
కొల్లగొడుతున్న కొoడలు
కొoదరి స్వార్ధానికి
బలి అవుతూ బడుగుజనం
సునామీలు తుఫానులు
మండే సూర్యుడు ఎండుతున్న పొలాలు
కలవరపెడుతూ వాతావరణ మార్పులు
సగటు జీవి బ్రతుకు దుర్భరం
ఆందోళనలే వారి జీవితం
కూలిన గుడిసెలు
కూకటి వేళ్ళతో నేల రాలిన వృక్షాలు
ఎన్నెన్నో చేప్పలేని మూగజీవుల వేదనలు
పరాకాష్టకు చేరిన నష్టం
గతి తప్పిన జీవన గమనం
చేయ్యాలిక జీవన సమరం
....వాణి కొరటమద్ది
12 nov 14
//కడలి//
సూర్యోదయం సూర్యాస్తమయం
సముద్ర గర్భాన అలరించు అద్భుత దృశ్యం
హద్దులు లేని ఆలోచనా తరంగం
కడలివలె లోతైనదేగా అంతరంగం
తుఫాను చుట్టుముట్టిన అల్లకల్లోలం
ప్రకృతి ఆగ్రహానికి అసలు రూపం సంద్రం
అనేక జలచరాల నివాసం సముద్రగర్భం
మత్యకారుల బ్రతుకుతెరువుగా సాగరం
అంతర్జాతీయ రవాణా జల మార్గాలు
దేశవిదేశాల వ్యాపార లావాదేవిలు
పడిలేచే కెరటాలు గెలుపుఓటముల చిహ్నాలు
గమ్యం ఎదురుగ వుందంటూ అర్ధం చెప్పే అరుణోదయం
పాల సముద్రమును మంధించి దేవతలు
అమృతమును సాధించి పొందిన అమరత్వం
సంద్రంలో కలుస్తూ నదులు సెలయేళ్ళూ
మనసుకు ఆహ్లాదం పంచే సాగర సంగమం

....వాణి కొరటమద్ది
10 nov14
జ్ఞాపకాల నిట్టూర్పులు మదిదాటని భావాలు
ఆరిపోని ధు:ఖాలు ఆగిపోని బాష్పాలు
//అక్షరాలు//
గాయపడ్డ క్షణాలు బాకులా గుచ్చుతున్న జ్ఞాపకాలే
మలాము ఎంత రాసినా మానిపోని రాచపుండును తలపిస్తూ
అనుక్షణం ఆ ఆలోచనలే మరలిపోని ఆవేదనలే
బాధలు భావాలై మౌనాక్షరాలౌవుతూ
గతం నీలినీడలు గాయాన్ని మానిపించే అక్షరాలవుతూ
చెదిరిన మనసుకు ఓదార్పుగా
గుండె గాయానికి మంత్రించే ఆయుధాలుగా
ఆత్మీయత పంచే అదృష్టాలుగా
మెలిపెడుతున్న జ్ఞాపకాలు మరిపించే సాధనాలు అక్షరాలు
నిర్లక్ష్యాల నిదర్శనాలుగా
బాధ్యత మరచిన బంధాలు ప్రశ్నించే అవకాశాలుగా
బాధల భావాలను వెలిబుచ్చే మనసుకు ఊరట కలిగిస్తూ
మాటలు పలకలేని పెదాలు అక్షరభావాలు ఒలికిస్తూ
స్వాంతన నాకు నేనుగా చెప్పుకుంటూ..
గాయపడ్డ మనసుతో గమనం సాగిస్తూ,..!!
.....వాణి కొరటమద్ది
7 sep 14
///మానవసంబందాలు///
తల్లి గర్భం నుండి బయట పడ్డాక మనిషి జీవ యాత్ర మొదలు
బాల్యంలో తల్లి తండ్రులు యవ్వనంలో భాగస్వామి సాహచర్యం
వృద్దాప్యంలో కన్నబిడ్డల సంరక్షణలోజీవితం
మానవ జీవితం జీవనదీ ప్రవాహం సూర్యోదయం సూర్యాస్తమయం
జీవితాలకి నిర్ణయిస్తాయి ఆద్యాంతాలు
ధర్మబద్దమైన జివితగమనం మానవ జీవిత లక్ష్యం
జీవించే కొద్దికాలాన్నిమంచిని పెంచే ప్రయత్నం చెయ్యాలి
మనిషి జీవితం సుఖదు:ఖాల సమ్మేళనం
పదుగురికి ఆదర్శంగా నిలిచినపుడె మానవ జన్మ సార్ధకం
జీవితమనే మూడక్షరాలు విభిన్న రుచుల మేళవింపు
మనిషి మనిషి కి మద్య బందం మానవత్వ ఆత్మీయ బందం
ఒకరికొకరు తోడుగా నిలుస్తూ కస్టసుఖాలు పంచుకుంటూ
కల్మషాలు దూరం చేస్తూ అపురూపమైనది స్నేహ బందం
అందరూ ఒక్కరి కోసం అంటూ ఒక్కరూ అందరి కోసం అనుకుంటూ
మానవీయ సంబందాల స్దాపనకై చెయ్యాలి కృషి
.....వాణి కొరటమద్ది
చిగురించే చెట్టును చూడు చిరునవ్వుతొ కనిపిస్తుంది...
చెమ్మగిల్లిన కనులను చూడు ఆహ్లాదం మరుగవుతుంది.!!
/బాపు బొమ్మలు //
గుండె తలపులు తట్టేలా కుంచెతో వర్ణచిత్రాలు విరచించారు
ముగ్ధ స్నిగ్ధ సౌందర్యాల గీతాచార్యుడు

పురాణ చిత్రాలను రేఖల్లో బంధించిన ఆధ్యాత్మికవేత్త
తలెత్తుకు తిరిగే తెలుగక్షరాలకి సొగసులద్దిన రూపశిల్పి
పచ్చని ప్రకృతిసౌందర్యాలను ఆవిష్కరించిన ఘనత
బాపు బొమ్మలు సృజనాత్మకతకు పట్టం కట్టే అద్బుత సంతకాలు
పొడవాటి వాలుజడ పెద్దబొట్టు చారెడేసికళ్ళు అందమైన చీరకట్టు
పదహారణాల తెలుగు భామ బాపు బొమ్మ
ప్రతీ పత్రికను అలరించిన బాపు బొమ్మల రమణీయత
బుడుగు బొమ్మలతో ప్రాణం పోసిన కార్టూన్ బ్రహ్మ బాపు.
శ్రీశ్రీ విప్లవ రచనలకు చలం భావాలకు
ఆరుద్ర కూనలమ్మ పదాలకు అజరామరం బాపు బొమ్మలు
అంతర్గత నిజందాగి తెలుగువారికి నవ్వులు కురిపించిన బాపు బొమ్మలు
సహజమైన ముదురు రంగులతో రూపుదిద్దుకుని మైమరపిస్తాయి
రామాయణ మహాకావ్యం సీతస్వయంవరం రావణ సీత సంవాదం
బొమ్మల సంకలనాలు అవగతం చేసేను ఆయన చిత్రకళలు
తెలుగు సంసృతిని ప్రతిబింబించేబొమ్మలు అందానికి అందంలా మెరిపిస్తూ
తెలుగు వారికి తెలుగు దనాన్నిచిత్రకారులకు చిత్ర కళను
క్రొంగొత్తగా పరిచయం చేసే సృజన శీలి.....!!!
........వాణి కొరటమద్ది
5 sep 14
ఓడిపోయిన మనుషుల నడుగు గెలుపుదారి చూపిస్తారు
గాయపడ్డ మనసుల నడుగు జీవితసత్యం బోధిస్తారు...!!
10 sep 14
//ఆకాశం//
మింటకెగసిన మానవుడైనా
చివరకు మట్టిలోనె మరుగవుతాడు
విశాల నీలాకాశం
లోకమంతా పరుచుకునుంది
ప్రాంతాలేవైనా కానీ
ప్రపంచాన మనుష్యులమేగా
అందరికీ ఆ నీలకాశం
నీడనిచ్చే గొడుగే కదా
మనకెందుకు తారతమ్యం
కలిసుండే మష్యులమేగా ...!!
........వాణి కొరటమద్ది
11 sep 14
//ఆకాశం//
ప్రకృతి పవిత్రం మానవ శరీరమూ పవిత్రం
జీవులు పంచభూతాత్మకాలు
జీవిస్తూన్నాయి ప్రకృతిఆధారంగా
విశాల నీలాకాశం లోకమంతా పరుచుకునుంది
పంచభూతాలలో ఆకాశం సూక్ష్మాంశం
ఎంతటివాటికైనా స్ధానమిచ్చి వినమ్రంగా కనిపిస్తుంది
హద్దులేని నింగి సూర్య మండలాలను
నక్షత్రమండలాలను నింపుకుని వుంది
ఆకాశం నుండే విశ్వం ఉద్భవించింది
ప్రాణవాయువును జీవులకు అందిస్తుంది
ఆకాశం శూన్యం భూమి గోచరం
సహజ గుణ శబ్ధం కలిగిన ఆకాశం శక్తి నాద బ్రహ్మము( ఓంకారం )
అలసిన మనసు నిర్మలమైన నింగిని చూసి శాంతన పొందుతుంది
అవనిపై నీరు ఆవిరై మేఘాలుగా మారి చిరుజల్లులుకురిపిస్తుంది
జ్యోతీష్య శాస్త్రానికీ ఖగోళ శాస్త్రానికి
అద్భుతాలు సృష్టించేందుకు అవకాశం ఆకాశం..!!
........వాణి కొరటమద్ది
13 sep 14
//జ్ఞాపకం//
చుక్కల్లో వున్నావేమోనని
చిత్రంగా చూస్తుంటాను
కడలిలో కనిపించవని తెలిసినా
కెరటాలను ఆత్రంగా చూస్తుంటాను
కలల్లో కనిపిస్తుంటావు
ఊహల్లో నడిచొస్తుంటావు
కదిలే బొమ్మవు నీవై
కన్నీటి పర్యంతం చేస్తావు
"నిజం" నీవు లేవని చెప్పి
గుండెకు గాయం చేస్తావు
........వాణి కొరటమద్ది
15 sep 14
ఓడిపోయిన మనుషుల నడుగు గెలుపుదారి చూపిస్తారు
గాయపడ్డ మనసుల నడుగు జీవితసత్యం బోధిస్తారు...!!
10 sep 14
//వెంటాడే నీడ//
పున్నమి నాటి అలల తలపిస్తూ
కన్నీటి కెరటం ఉధృతమైన ప్రవాహం అవుతుంది
మనసు గాయం మెలిపెట్టినపుడు
చెమ్మగిల్లిన కనులు తడి ఆరని తీరంలా మెరుస్తూనే వుంటాయి
జ్ఞాపకాల తీరం ఆరిపోని దు:ఖాలను గుర్తు చేస్తూనే వుంటుంది
మాసిపోని మది గాయాలు మౌనాన్ని పెంచాయి
కడలి తీరంలో ఓదార్పు వెదుకుంటూ
గద్గద స్వరాన్ని మాయం చేస్తుంటాను సముద్రపు హోరులో
ఆలోచనలు ఉదృతమైన కెరటాల్లా మనసుపై దాడి చేస్తుంటాయి
మనసు గాయం మెలి పెడుతూనే వుంటుంది వెంటాడే నీడలా...!!
........వాణి కొరటమద్ది
//వెంటాడే నీడ//
పున్నమి నాటి అలల తలపిస్తూ
కన్నీటి కెరటం ఉధృతమైన ప్రవాహం అవుతుంది
మనసు గాయం మెలిపెట్టినపుడు
చెమ్మగిల్లిన కనులు తడి ఆరని తీరంలా మెరుస్తూనే వుంటాయి
జ్ఞాపకాల తీరం ఆరిపోని దు:ఖాలను గుర్తు చేస్తూనే వుంటుంది
మాసిపోని మది గాయాలు మౌనాన్ని పెంచాయి
కడలి తీరంలో ఓదార్పు వెదుకుంటూ
గద్గద స్వరాన్ని మాయం చేస్తుంటాను సముద్రపు హోరులో
ఆలోచనలు ఉదృతమైన కెరటాల్లా మనసుపై దాడి చేస్తుంటాయి
మనసు గాయం మెలి పెడుతూనే వుంటుంది వెంటాడే నీడలా...!!
........వాణి కొరటమద్ది
//అమ్మాయిలు...చదువులు.//
శరీరానికి ఆభరణాలే కాదు
మనసుకు ఆభరణం చదువులు
ఆర్ధిక స్వాతంత్ర్యంకి ఆత్మవిశ్వాసానికి
అమ్మాయిలకి చదువు ఆవశ్యకం
చదువు ఉద్యోగం అన్ని వున్నా
ఆధిపత్యధోరణి ఇంకా కొనసాగుతున్నా

అబ్బాయిల ఆధిపత్యాన్ని అధిగమించడానికి
అన్ని రంగాల్లో మేటిగా సాటిగా ప్రగతి సాధిస్తూన్నారు
పెరుగుతున్న అమ్మాయిల చదువుల శాతం
దేశం ప్రగతి బాటలో పయనించే అవకాశం
ఆలోచనా పరిణితి సూచిస్తోంది
వారి స్వయం నిర్ణయాధికారం
అవార్డులూసాధిస్తూ
అంతర్జాలంలోనూ దూసుకుపోతూ
ప్రంపంచాన్ని సైతం చుట్టి వస్తూ
ధైర్యంగా అడుగులు వేస్తున్న నేటి అమ్మాయిలు
తేజోవంతం అవుతున్నారు చదువుల వల్లనే ...!!
.....వాణి కొరటమద్ది
17 sep 2014
కళ్ళేమో కలలు కనే రహస్యాన్ని కనిపెట్టేసాయి..
కనులు ఊహలతో ఊసు లాడు కుంటున్నాయి...!!
మదిభావాలు మౌనగీతాలు ఊరటనిచ్చేమంత్రాక్షరాలు
చెరిగిపోయిన చిరునవ్వులకు శాంతి కపోతాలు..!!
//సీతాకోక చిలుక//
సృష్టిలోని అందమంత నింపుకున్న
ప్రకృతి అందాలకు చిరునామా
వన్నె చిన్నెల సీతాకోక చిలుక
పరవశించే ప్రకృతి ఓడిలో
నీలాల నింగిలో స్వేచ్చగా విహరిస్తూ
పువ్వు పువ్వుపై వాలి పులకరిస్తావు
అందాల సుమాల పూదోటల్లో
మకరందాన్ని ఆస్వాదిస్తూ
చిన్నారి బాబులకు చిరునవ్వులిస్తావు
పంచరంగుల సీతాకోక చిలుకల్ని
పట్టుకోవాలని ఉబలాట పడతారు
ఆడుకోవాలని ఆత్ర పడుతుంటారు
రెక్కల అందాలు చిన్నారుల మోముల్లోఆనందాలు
....వాణి కొరటమద్ది
//ఆకాశం//
ప్రకృతి పవిత్రం మానవ శరీరమూ పవిత్రం
జీవులు పంచభూతాత్మకాలు
జీవిస్తూన్నాయి ప్రకృతిఆధారంగా

విశాల నీలాకాశం లోకమంతా పరుచుకునుంది
పంచభూతాలలో ఆకాశం సూక్ష్మాంశం
ఎంతటివాటికైనా స్ధానమిచ్చి వినమ్రంగా కనిపిస్తుంది
హద్దులేని నింగి సూర్య మండలాలను
నక్షత్రమండలాలను నింపుకుని వుంది
ఆకాశం నుండే విశ్వం ఉద్భవించింది
ప్రాణవాయువును జీవులకు అందిస్తుంది
ఆకాశం శూన్యం భూమి గోచరం
సహజ గుణ శబ్ధం కలిగిన ఆకాశం శక్తి నాద బ్రహ్మము( ఓంకారం )
అలసిన మనసు నిర్మలమైన నింగిని చూసి శాంతన పొందుతుంది
అవనిపై నీరు ఆవిరై మేఘాలుగా మారి చిరుజల్లులుకురిపిస్తుంది
జ్యోతీష్య శాస్త్రానికీ ఖగోళ శాస్త్రానికి
అద్భుతాలు సృష్టించేందుకు అవకాశం ఆకాశం..!!
........వాణి కొరటమద్ది
//బాపురమణ //
బాపు బొమ్మలు రమణీయం
రమణ అక్షరాలు కమనీయం
బాపు పేర్చిన బొమ్మలకు
రమణ అల్లరి చేయించారు
నవ్వుల పువ్వులు విరబూయించారు
బద్దీల లాగు చింపిరి జుత్తు
బుడిబుడి నడకల బుడుగు
బామ్మకి వాడు చిచ్చర పిడుగే
వాడి గమ్మత్తులు కోకొల్లలు
సిగాన పెసూనాంబ రెండుజెళ్ళ సీతా
రాధాగోపాలం ప్రక్కింటి పిన్ని గారి మొగుడు
అప్పారావ్ గుర్నాధం తుకారంపేర్లే నవ్వుతెపించే
మధ్యతరగతి మందహాసం తమదైన శైలిలో
బాపూ రమణలు వేరుగ కనిపిస్తున్నా
ప్రసిరించిన వెలుగులొకటే
పదులకొద్దీ ప్రాత్రలు సృష్టించి
చిరంజీవులను చేసి
బాపురమణ తెలుగువారి గుండెల్లోఅజరామరం
.....వాణి కొరటమద్ది
21 sep 14
సూర్యకిరణం చిరుజల్లు ఏకమై..
హరివిల్లును పరిచయంచేస్తూ వర్ణశోభితంగా!!
/బాధ్యత//
గాలి నీరు అగ్ని ఆకాశం భూమి పంచభూతాలు
ప్రకృతి ప్రసాదిత వరాలు
విధ్వంశానికి కారణమౌతూ మానవ అనాలోచిత చర్యలు
నేలతల్లీ నీకు వందనం సమస్త జీవకోటి మనగడకు నువు కారణం
మానవుని అత్యాశ ఖనిజసంపదకై అన్వేషణ
ఆకాశం కురిపించే వర్షం
పచ్చని ప్రకృతికి జీవుల ఆహారానికి ఆధారం
పరిశ్రమల వ్యర్ధాలు మలిన మవుతున్న నీరు నేల గాలి
అనారోగ్యకారణమై అర్ధాయుస్సుతో ముగిసిపోతూజీవితాలు
మండే భూగోళం మనిషి మనుగడను ప్రశ్నిస్తూ
అంతరించిపోతూ అడవులు కలవరపెడుతూ వాతావరణ మార్పులు
మానసిక ప్రశాంతతను దూరం చేస్తూ శబ్ద కాలుష్యం
ప్లాస్టిక్ హానికర పదార్ధం
వ్యవసాయాన రసాయనాల వినియోగం ప్రమాదం
ప్రకృతి మాత అందాన్ని ఆకర్షణను ఆహ్లాదాన్ని కలుషితం చేస్తున్నాం
జంతుజాతుల్ని పక్షుల్ని సంహరిస్తున్నాం
మానవుల్లో మార్పు రావాలి ప్రకృతి తల్లిని కాపాడుకోవాలి
పర్యావరణాన్ని పరిరక్షించాలి
ప్రకృతికి ప్రణమిల్లుదాం క్రొత్త తరాన్ని స్వాగతిద్దాం
భావితరాలకోసం మనిషి మనుగడకోసం...!!
....వాణి కొరటమద్ది
19 oct 14

Tuesday, November 11, 2014

ప్రియమైన చింటూ,
ఎంటో నీ జ్ఞాపకాల్లో నేనెపుడు మునిగి తేలుతుంటాను నీవు లేని తనం నన్నింకా చిత్రహింస చేస్తూనే వుంది నిన్ను గెలుచుకోవాలనే పోరాటంలో జరిగే ఎన్నో అన్యాయాలు చూశాను డబ్బు మయమైన సమాజం ఎంత విలువలు కోల్పోయిందో అవగతం చేసుకున్నాను అలానే కొందరు మానవత్వం వున్న మనుషులను చూశాను అలాoటి వారిని కొoదరు పిచ్చి వాళ్ళుగా జమ కట్టడం అర్ధం చేసుకున్నాను, కొత్త ప్రదేశం పరిచయమే లేదు ఊరు. అలాంటి చోట మా ఇద్దరి పోరాటం నీ కోసం. బంధువులు వొచ్చి పలుకరించిందీ లేదు సహకరించిందీ లేదు అస్తమాను ఫోనులు, కాల్ వొచ్చినపుడల్లా విసిరి కొట్టాలనిపించేది ఎందుకలా ప్రవర్తిస్తారో అర్ధమయ్యేది కాదు కన్నీళ్ళు తప్ప మాలో మరో స్పందన వుండేది కాదు. ఓడిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటే ఎన్ని కన్నీళ్ళో..! ప్రపంచంతో ఫ్రీగా కలవలేక పోతున్నాం. ఓటమి తెలిసిన వాళ్ళందరూ అలానే చూస్తున్నారులే. దారిన పోయే కుక్క తో నైనా అవసర పడుతుందని అందరితో సక్యతగా వుండమని నాన్న చెప్పిన మాట ఎప్పుడూ గుర్తొస్తుంది. నేను అలానే వుండేదాన్ని ఎవరెన్ని అన్నాతిరుగు సమాదానం చెప్పేదాన్ని కాదు వాళ్ళ అంతరాత్మకి తెలుసులే వాళ్ళ తప్పొప్పులని మనసుకు సర్ది చెప్పుకునేదాన్ని. కాస్త పెద్దదయింది కదా పాప ఎందుకమ్మా అలా అంటే నువ్వు ఎమీ మాట్లాడవు అంటూ వుంటుంది తనకి బాధగా వుంటుందేమో నన్ను అన్నారని. వాళ్ళకే తెలుస్తుందిలే అని తనని వూరుకో పెడతాను. కానీ అందరిలో మార్పు మాత్రం బాగా కనిపిస్తొంది అందరి మాటల్లో డబ్బు ప్రాదాన్యత కనిపిస్తుంది నేను కష్టంలో వున్నపుడు ఎక్కడ సాయం చేయాల్సివొస్తుందో అని ముఖం చాటేసిన వాళ్ళే ఇప్పుడు ప్రేమ ఒలక పోస్తున్నారు. డబ్బు మయమైన లోకంలోబంధాలు విలువలు కోల్పోయాయి కదూ ముసలివాళ్ళంటే నీకు ఎంత ఇష్టం కదూ! కానీ ముసలివాళ్ళేఆశ్రమాలపాలై పోతున్నారు తెలుసా! మoచితనం కలిగిన వాళ్ళు ఎక్కువ కాలం జీవిoచరనే మాట పెద్దలు చెప్పినపుడెపుడో విన్నా అది నిజమే అనిపిస్తుంది నీ మంచితనం దేవుడికి నచ్చిందేమో అందుకే నిన్నంత త్వరగా తిసుకెళ్ళీపోయాడు 'అపద్దం చెప్పరాదు' అన్న మాటని అక్షరాల పాటించేవాడివి ఇపుడoతా అపద్దాలతోనే సమాజం గెలుస్తోంది తెలుసా?మరో చోట మంచితనం గెలిచే చోట నీ కోరికలన్నీ తీరే చోట సంతోషంగా వున్నావని సర్ది చెప్పుకుంటున్నా! నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాదు మనసులోది చెప్పుకుంటే కదా రిలాక్సెషన్ దొరికేది.ఏమో ఎలా చెప్పనో చింటూ నా ఫీలింగ్ అంతా అక్షరాలతో చెప్పేసుకున్నా నీ మంచితనాన్ని నీ నిజాయితీని నేనెప్పటికీ మర్చిపోలేను నీజ్ఞాపకాలు నా మనన్సులో ఎప్పుడూ గూడుకట్టుకునే వుంటాయి సరే చిoటూ ఇప్పుడు హాయిగా వుంది నా మనసులోని అక్షరాలన్ని బయటకొచ్చేశాయి.
...అమ్మ
ఎగసి పడే అలలన్నీ తీరానికి అంకితం --
నా మౌనం వర్షించే అక్షరాలు నీకేగా అంకితం ....!
అమ్మేగా పరిచయం చేసింది లోకానికి .....
మమతలని పంచుతూ నడతలని నేర్పుతూ..!!
// హుదుద్ //
భూగోళం భారమై ఆవేశపడుతోంది
మానవుల తప్పులపై కన్నెర్ర చేస్తోంది
కల్లోలం సృష్టిస్తూ కలవరపెడుతోంది కడలి
ఉప్పెనై ముంచ్చెత్తి ద్వంశ రచన చేస్తోంది
నిలువ నీడ కోల్పోయి నిశ్చేష్టులైన జనం
చేష్టలుడిగి చూస్తున్న ఆప్రకృతినే దైవం
కూలిపోయిన చెట్లు కన్నీరు పెడుతున్నాయి
సూర్యునికి స్వాగతం మంటూ నేలకొరిగిపోయాయి
కడలి ఆవేశానికి హద్దు లేక పోయింది
ప్రకృతితో కలసి పోయి ప్రతాపం చూపింది
గాలి పెనుగాలై మారిపోయి కడలితో జత కలసి
ఆకాశంలో అలలుగా తెరలు తెరలుగా వర్షం
సుందర నగరం శిధిలమై పోయింది
గాఢాంధకారంలో తడుముకుంటొంది
హుదుద్ పెరుతో పెనుతుఫానై వచ్చావు
మరువలేని గాయంతో ప్రళయవేదన మిగిల్చావు
ప్రకృతమ్మా నీకు ప్రణమిల్లుతున్నాము
మరోమారు మా జీవనాన్ని గాయపరచొదంటూ..!!
....వాణి కొరటమద్ది
17 oct 14
//బాధ్యత//
గాలి నీరు అగ్ని ఆకాశం భూమి పంచభూతాలు
ప్రకృతి ప్రసాదిత వరాలు
విధ్వంశానికి కారణమౌతూ మానవ అనాలోచిత చర్యలు
నేలతల్లీ నీకు వందనం సమస్త జీవకోటి మనగడకు నువు కారణం
మానవుని అత్యాశ ఖనిజసంపదకై అన్వేషణ
ఆకాశం కురిపించే వర్షం
పచ్చని ప్రకృతికి జీవుల ఆహారానికి ఆధారం
పరిశ్రమల వ్యర్ధాలు మలిన మవుతున్న నీరు నేల గాలి
అనారోగ్యకారణమై అర్ధాయుస్సుతో ముగిసిపోతూజీవితాలు
మండే భూగోళం మనిషి మనుగడను ప్రశ్నిస్తూ
అంతరించిపోతూ అడవులు కలవరపెడుతూ వాతావరణ మార్పులు
మానసిక ప్రశాంతతను దూరం చేస్తూ శబ్ద కాలుష్యం
ప్లాస్టిక్ హానికర పదార్ధం
వ్యవసాయాన రసాయనాల వినియోగం ప్రమాదం
ప్రకృతి మాత అందాన్ని ఆకర్షణను ఆహ్లాదాన్ని కలుషితం చేస్తున్నాం
జంతుజాతుల్ని పక్షుల్ని సంహరిస్తున్నాం
మానవుల్లో మార్పు రావాలి ప్రకృతి తల్లిని కాపాడుకోవాలి
పర్యావరణాన్ని పరిరక్షించాలి
ప్రకృతికి ప్రణమిల్లుదాం క్రొత్త తరాన్ని స్వాగతిద్దాం
భావితరాలకోసం మనిషి మనుగడకోసం...!!
....వాణి కొరటమద్ది
19 oct 14
//ఆశ//
తొలి జీవితమంతా
నిను ప్రేమగ నడిపించాలనుకున్న
మలి జీవితమంతా
నువు తోడై నడిచొస్తావనుకున్న
గమ్యం నే చేరేలోగా
నువు గొప్పగ వెలగాలనుకున్నా
నా ఆయువు నీకిచ్చి
చిరునవ్వుతో నిను చూడాలనుకున్నా
నా నవ్వును మరిచాను
నువు గగనంలో కెళ్ళాక
శాపగ్రస్త శిలనేగా
నీ ఊపిరి ఆగాక
ఇంకా ఏదో ఆశతో
బ్రతుకు నడిపిస్తున్నా
మలి కానుకగా
నువు మరలొస్తావనుకుంటూ
నీ చిరునవ్వుల వెలుగు
నే చూడాలనుకుంటూ...!!

....వాణి కొరటమద్ది
27 oct 14
//పిల్లలం//
చిన్నారులం చిన్ని నవ్వులం
భావి భారత బాటసారులం
పెద్దలననుకరించు పిల్లలం
వారి ఆశీస్సులూ ఆశిస్తాం

పెద్దలు మంచి బాటలు వేస్తే
ఆ బాటల్లో మేము నడిచోస్తాం
నవ్య భారతాన్నీనిర్మిస్తాం
క్రొత్త వెలుగులు పూయిస్తాం
పండుగలన్నీ మాకు సందడులే
అంబరమంత సంబరమే
ప్రతి కుటుంబానికి దీపాలం
ప్రగతికి మేము సోపానం
....వాణి కొరటమద్ది
2 nov 14
//చెట్టు//
దారి పొడవునా బాటసారికి
నీడనిచ్చే గొడుగౌతా
వాహనాలు వదిలేగాలి
సుద్దిచేసే మరనౌతా

కడలి కల్లోలాకు
రక్షణ కవచo నేనేగా
తుఫానపుడు వీచేగాలిని
అదుపు చేసే తెరనౌతా
ఆకాశంలో ఎగిరే పక్షికి
విశ్రాంతినిచ్చే నెలవునేనేగా
పెరటితోటలో నేనుంటే
శ్రమ లేని వింజామరనౌతా
ప్రేమగా పెంచు కుంటే
ప్రతిచోటా పచ్చదదాన్నే
ఆప్యాయత పంచకున్నా
ఆహ్లాదం పంచే తెమ్మెరనే ..!!
....వాణి కొరటమద్ది
4 nov 14
//గాయం//
ఎడారిలో నేనేమీ లేను
గొoతు తడి ఆరకపోడానికి
కావల్సినన్ని కన్నీళ్ళు వున్నాయ్
కుండలు నింపుకోడానికి

జీవ చైతన్యం కోల్పోయానేమో
జీవితం అర్ధం కావడంలేదు
అమాయకత్వంలోనే వుండిపోయానేమో
అంతరంగాన్నిఅర్ధం చేసుకోలేక పోతున్నా
గాయం ఘాటుగానే తగిలింది
మనసునొప్పికి అలవాటు పడుతోంది
గుండె కఠినంగా మారమంటోంది
భవిష్యత్తును వెతక మంటోంది ..!!
....వాణి కొరటమద్ది
5 nov 14
 గజల్ -6

వెలుగొదలని నీడలా నువు గుర్తొస్తున్నావు
మనసొదలని జాడలా నువు గుర్తొస్తున్నావు

మరలరాని లోకానికి తరలి నీ వెళ్ళిపోయావు
అడుగడుగున తలపుల్లో మాటలా నువు గుర్తొస్తున్నావు

మనసంతా నిండివున్న మౌనంలా నే మారినా
అనుక్షణం స్వప్నంలో తోడులా నువు గుర్తొస్తున్నావు

వేలుపెట్టి నడిపించిన క్షణాలే నీ జ్ఞాపకమై
మరువలేని గుర్తులుగా జాడలా నువు గుర్తొస్తున్నావు

ఓడిపోయి పోరాటం గెలుపురుచి నే నెరుగ లేదు
కానరాని నీ రూపం కలలా నువు గుర్తొస్తున్నావు
....వాణి కొరటమద్ది
11 nov 14
గజల్ - 5
ఆశా నిరాశ ఊగిసలాటే జీవితం
కన్నీరు పన్నీరు ప్రవహించేదే జీవితం
ఎండా వాన కలసినపుడే హరివిల్లు
సప్తవర్ణాల సమూహమే జీవితం
సూర్య చంద్రులు ప్రకృతిలోని భాగాలు
వెలుగు చీకటుల సమ్మేళనమే జీవితం
వధూవరులను ఏకం చేసే వివాహబంధం
తోడూ నీడగ కలిసుండేదే జీవితం
....వాణి కొరటమద్ది
4 nov 14
తెలుగు గజల్ - 4
అమ్మ ఒడిలో కమ్మదనం గుర్తొస్తూ ఉన్నది
ఆ ఒడిలో చిన్నారినై ఆడాలని ఉన్నది
ప్రతీదీ కావాలని కోరుకున్న బాల్యం
అందించిన నాన్నప్రేమ కావాలని ఉన్నది
చెట్లెక్కీ ఆడుకున్న కోతికొమ్మ ఆటలు
ఆనాటీ నేస్తాలని చూడాలని ఉన్నది
కృష్ణా నది తీరంలో గవ్వలకై వెతికిన
ఆ తీరం చేరుకుని ఏరాలని ఉన్నది
నా అడుగులు వినిపించిన సిరిమువ్వల సవ్వడి
మువ్వలసడి వింటూనే మురవాలని ఉన్నది
నడుస్తున్న దారంతా ముళ్ళ బాట అయితే
బాల్యానికి మరల వెళ్ళి బ్రతకాలని ఉన్నది
....వాణి కొరటమద్ది
29 oct 14
మరో ప్రయత్నం గజల్-3
అక్షరాలు ఒలికించే అర్ధమెంత బాగున్నది
కవనంలా మారుతున్న భావమెంత బాగున్నది
తొలిస్పర్శ మురిపించే తల్లిప్రేమ మధురంగా
అమ్మఒడిని చేరుకున్న అందమెంత బాగున్నది
వాడ్చేసిన ముసలితనం కన్నప్రేమ తోడుండగ
వార్ధక్యం కానరాని ఆశ ఎంత బాగున్నది
గుండెలోతు గాయాలకు తొలగిపోని దు:ఖాలకు
ఆత్మీయుల ఓదార్పు పలకరింత బాగున్నది
....వాణి కొరటమద్ది
తెలుగు గజల్ -- 2
అలసి పోని ఆకెరటం ఆరాటం చూస్తున్నా
మునుముందుకు సాగాలని పోరాటం చూస్తున్నా
ఓటమెంత ఎదురైనా ప్రయత్నం మాననంటూ
తీరాన్ని చేరాలనె ఉబలాటం చూస్తున్నా
తుడిచేస్తూ అడుగులను గతం మరచి నడవమనే
తరంగాలు చెపుతున్న గుణపాఠం చూస్తున్నా
కడలి నీరుల కన్నీరూ వ్యర్ధమేనంటూ
ఊరడించు సముద్రాన్ని ముచ్చటగా చూస్తున్నా
కడలి ముందు కూర్చునీ తరంగాల తోడుంటే
ఓదారిన మనసుల్లో ఉత్కంఠo చూస్తున్నా
....వాణి
/తెలుగు గజల్/
తొలకరిలో తడిసి మట్టి వాసనెంత బాగుందీ
చిరుజల్లుకు పులకించే హృదయమెంత బాగుందీ
హరివిల్లును చూస్తుంటే మనసు తృళ్ళి పడుతుంది
రంగుల్లో మెరవాలని కోరికెంత బాగుందీ
చిరువెచ్చని ఉషోదయం అనుభూతీ బాగుందీ
అమ్మస్పర్శ కురిపించే ప్రేమఎంత బాగుందీ
అక్షరాల అమరికలో మౌనమెంత బాగుందీ
పొoదుపరచిన పదాలందు అల్లికెంత బాగుందీ
//తొలి గజల్ ప్రయత్నం Abd wahed గారి సహకారంతో//
....వాణి కొరటమద్ది
8 oct 14
//మౌనం...//
తలపోసిన వన్నీ
తీరని కోరికలైనాయి
ప్రపంచాన్ని చూడక
నే బందీ నై పోయాను
హృదయానికి గాయం
చిరునవ్వు దూరం
వెక్కి వెక్కి ఏడీపించి
మాయమై పోయావు
మమత పంచక నువ్వు
కనుమరుగై పోయావు
వంచకాల లోకంలో
ఇమడలేక పోయావా?
ఆశలన్ని వమ్ము చేసి
మెరుపువై పోయావు
బ్రతుకుదారంతా
ప్రశ్నార్ధక చిహ్నాలే
బదులు లేని బాటల్లో
పయనమౌతూ మౌనంగా
వెలుగుదారులు మూసుకున్నా
మిగిలివున్నా చీకటిలోనీవే లోకంగా.....!!

....వాణి కొరటమద్ది
30 oct 14
// బాల్యం ఓ మధుర సంతకం//
అమ్మగర్భాననులి వెచ్చదనం
ఒడిలోని కమ్మదనం
పొత్తిళ్ళ పసిపాపకి అపురూప వరం
అమ్మ ఒడి ప్రపంచాన్ని జయించిన ఆనందం

నాన్న వేలు పట్టుకు నడిపించిన ఆ అడుగులు జ్ఞాపకం
అపుడా నడకల్లో ఏదో తెలియని గర్వం
అక్షరాలు దిద్దుతూ గురువుగారి మెప్పులోఅంతేలేని సంబరం
పాఠాలతోపాటునీతి కధలు వింటూ
ఆ నీతిని జీవితాన మరువకూడదనుకుంటూ
మరుపురాని ప్రయత్నాలు మరలరాని అనుభవాలు
కృష్ణానది తీరాన ఏరుకున్న గవ్వలు
అక్కతోపాటు పంచుకున్న నవ్వులు
మదిలో మెదిలే ఆ తలపుల మైమరపులు
చెదిరిపోయిన గుజ్జనగూళ్ళు జ్ఞాపకాలే ఆనవాళ్ళు
అష్టాచెమ్మ తొక్కుడుబిళ్ళ ఆరోగ్యకరమైన ఆటలు ఎన్నో
మనసును ఉల్లాస పరిచే ఊహలు ఎన్నెన్నో
చిరు చిరు పోట్లాటలు పెంకితనాలు
నాన్న మందలింపులు అమ్మ చెంత గారాలు
అనునయ పలుకు అలుక తీర్చే కానుకలు
మరువలేని బాల్య స్మృతులు
అందమైన హరివిల్లులు
తీపి జ్ఞాపకం బాల్యం
ప్రతి జీవితానికి ఓ మధుర సంతకం...!!
....వాణి కొరటమద్ది
31 oct 14
// అంతరంగం//
మనసున దాగున్న కలలెన్నో
తీర్చలేని వ్యధ లెన్నో
జ్ఞాపకాల గుచ్చం అంతరంగం
మధురానుభూతులు
మరువలేని గాయాలు
అనుభవాల సారాలు
ఆత్మ విశ్వాసాలు
అందమైన బాల్య స్మృతులు
మెరిసే చిరునవ్వులు
మధురూహలు
ఆ ఊహల మైమరపులు
అంతరంగ తరంగాలు
ఎగసిపడే ఆనందాలు
జ్ఞాపకాల గాయాలు
మెలిపెట్టే దు:ఖాలు
ఉబికే కన్నీళ్ళు
ఉధ్రుతమయ్యే కెరటాలు
కడలిని తలపించే ఆనవాళ్ళు
మౌనం వర్షించే భావాక్షరాలు
మది మదనానికి
ఊరటనిచ్చే మంత్రాలు
ఆశలు ఆశయాలు
మమతలు మానవత్వాలు
అంతరంగ స్పందనలు
మనసు పలికే అంతర్మధనాలు

....వాణి కొరటమద్ది
3 nov14