Thursday, March 20, 2014

మరో రూపంలో ......



వికసించవు రాలిన మొగ్గలు
చిగురించవు ఎండిన కొమ్మలు

అతకలేదు పగిలిన అద్దం
వెతకలేము కన్నీటిని నదిలో

తిరిగిరాదు పోయిన ప్రాణం
తరిగిపోదు నాలో దు:ఖం

అడుగులు ఆలస్యంగా వేశావు
ఆత్రంగా జీవితాన్ని ముగించేశావు

నీ స్పర్స దూరం అవడం నిజం
మనసంతా నీవన్నది వాస్తవం

నిజాయితీ నిబద్దత కలిగిన నీ భావాలు
అవినీతీ స్వార్దం మద్యన సర్దుబాటు కాలేవు

మదిలో నీ రూపు చెరిగిపోదెప్పటికీ
మరో రూపంలో వస్తావు ముమ్మాటికీ


వాణి కొరటమద్ది
20/3/2014

No comments:

Post a Comment