Monday, March 10, 2014

సంఘర్షణ


నిష్క్రమించి
నిశ్చింతగా నువ్వు
జీవిస్తూ
జీవచ్చవంగా నేను

జన్మనిచ్చి పునర్జన్మ నివ్వలేని
మనసు పడుతున్న
సంఘర్షణ

మౌనంగా వున్నానో
మనసు చంపుకున్నానో

సమాజం వెలి వేసిందో
వెలి వేశానో

న్యాయాన్ని కోల్పోయానో
అన్యాయం చేశానో

సంఘర్షణ

కష్టాల సంద్రం దాట లేకున్నా
కన్నీటి ప్రవాహంలో
కొట్టుకు పోతే బావుండు

లక్ష్య సాదనలో నిర్లక్ష్యం
స్వార్దం ముందు
ఓడిపోయిన సహనం

సంఘర్షణ

మనీ లోకం
విలువలేని మానవత్వం

తపన ,తాపత్రయం
బాద్యతలు ,బంధాలు
కనరాని సమాజం

బ్రతికి వున్న వారంతా
జీవచ్చావాలేమో...?
మరణించిన వారు
మహాత్ములనుకుంటా..?

సంఘర్షణ

vani
23/1/2014

No comments:

Post a Comment