Monday, March 10, 2014

' ఆశ'

క్రొత్తదనం కోసం..
కాస్త ఆనందం కోసం..

ఆశను అరువు తెచ్చుకుందామంటే..
అడియాశలు ఉచితంగా అంటుకున్నాయి

సంతోషాలను సమీకరిద్దామని
జ్ఞాపకాలలో వెతుకుతువున్నా

దురదృస్టాలను దులిపేద్దామని
అదృస్టాలలో తడుముతువున్నా

ఆవిరైన ఆనందాలను
అశ్రునయనాలలో శోధిస్తున్నా

అక్షరాలను అమరుద్దామంటే
'అమరు'డైన నువ్వే గుర్తొస్తావు

కలలో నువ్వే..
కన్నిటిలో నువ్వే

కొత్త కవితా వొస్తువు
కనిపించడం లేదు

కన్నిటితో కడుపు నింపుతూ
క్రొత్తఆశల కోసం..

అస్రువులతో నిండిన నా కళ్ళు
ఆనందాలకోసం ఆరాటపడుతున్నాయి

అరచేతిలో అరిగిపొయిన రేఖలలో
దురదృస్టమేఅంతిమ రేఖగా మిగిలింది

నిర్దయగా వెళ్ళిపోయిన.
.చిట్టితండ్రికోసం..
నిశిధీ వంక చూస్తూనే వున్నా..
దయతో అదృస్టాలనుమొసుకొస్తూ..
తారసపడతావని' ఆశ'

vani
18/1/2014

No comments:

Post a Comment