Saturday, March 29, 2014

//సముద్రం//

నింగి నేల ఏకామవ్వాలన్నట్లు సంద్రం ఆకాశంతో

స్నేహాన్ని కోరుతుంది అలల హస్తాలతో ఆత్రంగా

ప్రశాంతంగావున్నావని నీ నురగలె గుర్తుగా

మనసంతా ఆహ్లాదం పరుచుకుంది త్రుప్తిగా

సంద్రంపై ప్రసరిస్తూ కిరణాల వెలుగులు

మేఘమై మెరవాలని ఆకర్షిస్తున్నట్లుగా

హద్దులు లేని కోరికలకు నింగి అర్థం చెపుతుంది

అలవికాని ఆలోచనలకు నేల సమాధానం చెపుతుంది

అలుపెరుగని అలను చూసి కొత్తపాఠం నేర్చుకో

ఓటమి ఎదురైనా మున్ముందుకు దూసుకుపో

కెరటం తుడిచేస్తూ పాదాల గుర్తులు

గతం మరచి నడవమని గుణపాఠం చెపుతుంది

కడలి ముందు కూర్చుంటే కలత చెదిరిపోతుంది

మనసు ఓదార్పుకు తరంగం తోడవుతుంది

vani koratamaddi
29/3/2014

Wednesday, March 26, 2014


// సైనిక మహిళ //


అనాదిగా దగా పడ్డ గత చరిత్ర తిరగరాసి
వీరవనితవైనావు ధీరత్వం చూపినావు
అత్మరక్షణ అధిగమించి దేశరక్షణకై నడుంబిగించి
శారీరక అవరోధం ఆటంకం కాదని నీరూపించి
మహిళ జాగ్రుతమైతే ఏ దుష్టశక్తి అడ్డు రాదని తేల్చి
ప్రతిరంగంలో తనదైన శైలిలో పదం మోపి
భావి భారత నిర్మాణానికి బాసటగా నిలుస్తూ
తన ధైర్యం తనస్తైర్యం సైన్యంలో చూపిస్తూ
భారతీయ మహిళకు రక్షాకవచమైనావు
కూతురివై తల్లివై భార్యవై ఆబాద్యతా విస్మరించక
దేశానికి నీవంతు సహకారం అందిస్తూ
జై హింద్ జై భారత్ అంటూ నినదిస్తూవున్నావు


........వాణి కొరటమద్ది
// గురువు //

మాత్రుదేవోభవ పిత్రుదేవోభవ ఆచార్యదేవోభవ అన్నది అక్షర సత్యం
తల్లి తొలి గురువే మాట నేర్చినా నడక నేర్చినా నడత నేర్చినా
అమ్మ కను సన్నలలోనే
త్రిమూర్తి స్వరూపమే గురువు
అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాననజ్యోతి వెలిగించి
క్రమశిక్షణ నేర్పించి మేధస్సు పెంపొందించి
విధ్యార్దుల స్నేహితుడై మెలుగుతూ
భవిష్యత్ ప్రణాళికలకు పునాది వేస్తూ
విధ్యార్దుల ఆశయాలకు సహకరిస్తూ
ప్రముఖమైన వైద్యులుగా న్యాయవాదులుగా
వారి ఇష్టాలను అనుసరించి సలహాలు ఇస్తూ
దిశ నిర్దేశం చేసేది గురువు
గురుభ్యోం నమ:

......వాణి కొరటమద్ది
//మౌనం//

మౌనంగా వున్న మనసు
పలుకులు కరువై
నిశ్శబ్దరాగాన్ని ఆలపిస్తూ
పదాలతో ప్రపంచాన్ని పలుకరిస్తుంది

నిట్టూర్పుల గాలులు భరించలేక
నిశిలోకి చూస్తూ
మనసు తలపులు మూసుకుంటాను

నయనాలు కారుస్తున్న జల్లులు
చెక్కిళ్ళపై కన్నిటి సముద్రాన్ని తలపిస్తాయి

మాటలు పెదాలు దాటలేక
భావాలు బయటకు రాలేక..

అక్షరాలై ప్రవహిస్తుంటాయి
//అమ్మ కోసం వస్తావని...//


నీ చిత్రం చూసినపుడు
చిత్తరువే పొందుతాను

చేయి వదిలి వెళ్ళావని
చెమ్మగిల్లుతుంటాను

తలుపుతట్టి పిలిచినట్లు
తత్తరపడుతుంటాను

నీపిలుపుల ఆలాపన విని
ఉలికి ఉలికి పడతాను

ఆత్రంగా తలుపు తీసి
నీకోసం చూస్తాను

కనిపించకుండెసరికి
కన్నీటి పర్యతం అవుతాను

నువ్వు వస్తావని ఆశతొ
బ్రతికెస్తూ వుంటాను

నీరాకకై నేను
ఎదురుచుస్తుంటాను

అమ్మ కోసం వస్తావని
ఆశ పదుతుంటాను

//స్నేహం//


ఓ తియ్యని అనుభవం
కమ్మని అనుభూతి స్నేహం

మనసులో భావాలను
ఆత్మీయంగా పంచుకునేది స్నేహం

కన్నీటిని తుడిచేది
గుండెలోతు చూసేది స్నేహం

కష్టసుఖాలను
అర్దం చేసుకునేది స్నేహం

మనుషులు ఎంత దూరం వున్నా
మమతలు మాసిపోనివ్వనిది స్నేహం

చెరగని మమకారం
తెలియని ఓదార్పు స్నేహం

స్నేహానికి పునాది నమ్మకం
జీవితానికి మంచి మార్గం చూపాలి స్నేహం

Thursday, March 20, 2014

కలనిజమైతే.....


కల్లలైన కలలన్నీ
కలువలై విరబూస్తే  బాగుండు

అందని ఆనందాలన్నీ
ఉప్పెనలా ముంచెత్తితె బాగుండు

కనిపించని స్వర్గమేదైనా
కన్నుల ముందుకొస్తే బాగుండు

చేజారిన బందాలన్నీ
చేరువైతే బాగుండు

వెతుకుతున్న వెలుగురేఖలు
వెల్లి విరిస్తె బాగుండు

అందమైన జీవితమే
ఆహ్వనం పలికితే బాగుండు

కోరికలన్నీ తిర్చేటి
దేవుడే దిగి వొస్తే బాగుండు

మరో రూపంలో ......



వికసించవు రాలిన మొగ్గలు
చిగురించవు ఎండిన కొమ్మలు

అతకలేదు పగిలిన అద్దం
వెతకలేము కన్నీటిని నదిలో

తిరిగిరాదు పోయిన ప్రాణం
తరిగిపోదు నాలో దు:ఖం

అడుగులు ఆలస్యంగా వేశావు
ఆత్రంగా జీవితాన్ని ముగించేశావు

నీ స్పర్స దూరం అవడం నిజం
మనసంతా నీవన్నది వాస్తవం

నిజాయితీ నిబద్దత కలిగిన నీ భావాలు
అవినీతీ స్వార్దం మద్యన సర్దుబాటు కాలేవు

మదిలో నీ రూపు చెరిగిపోదెప్పటికీ
మరో రూపంలో వస్తావు ముమ్మాటికీ


వాణి కొరటమద్ది
20/3/2014
మురిపిస్తావా...


చందమామనే చుస్తుంటా..
చెదిరిన చిరునవ్వులను చిలుకరిస్తుందేమోనని

చుక్కలనే చుస్తుంటా..
మిణుకు మిణుకున తారల్లో మెరుస్తున్నావేమోనని

మనసంతా నీకోసమే ....
మరో ప్రపంచంలో కనిపిస్తావేమోనని

తినిపించా గోరు ముద్దలు
చందమామని చూపిస్తూ....

కల్పించిన కధలు చెప్పి
జోలపాడి మైమరిచా...

అమ్మగా లాలించి
గుండెలపై నిదురపుచ్చిన రోజులే జ్ఞాపకం

మధురస్మ్రుతులు గుర్తొస్తే
మరల నీకోసం నేనలా..

తపించి తలపించాలని
వొస్తావా మళ్ళీ..
మురిపిస్తావా...

వాణి కొరటమద్ది
20/3/2014

Friday, March 14, 2014

                                       అమ్మ బాష
                                   

అమ్మ బాష తెలుగు కమ్మని బాష తెలుగు
తియ్యనైన బాష తేనెలొలుకు బాష

యాస యేదైతేనేం బాష ఒక్కటే
ప్రాంతమేదైతెనేం ప్రాంతీయబాష తెలుగేగా

కాళేస్వరం,శ్రీశైలం,భీమవరం శైవ క్షేత్రాలే త్రిలింగ దేశమై
ఈమూడు ప్రాంతీయుల బాషే తెలుంగు గా నానుడి

తెలుగుబాష మనదిగా వెలుగొందేబాష మనదేగా
పసందైన బాష పరవసించే బాష

సంస్కృతంలోని తియ్యదనం,కనడంలో అమృతత్వం,
తమిళములోని పరిమళం కలగలిపిన కమ్మనైన బాష తెలుగేగా

తెలుగు సోదరులం మనం తెలుగు తల్లి బిడ్డలం
మనకెందుకు వైవిద్యం,మనకెందుకు వైరుడ్యం

కలసికట్టుగ నడుంకట్టి ప్రగతి రధం లాగుదాం
తెలుగువారిలో సమైక్యతను పెంచుదాం

పీడకలలు మరుద్దాం నైరాశ్యం వీడుదాం
రాబోయే తరాలకు తెలుగుబాషపై ఆసక్తిని పెంచుదాం

మన బాషాభిమానాన్ని నిల బెడదాం
మన బాషా సమైక్యతను చాటుదాం


వాణి కొరటమద్ది
15/3/2014

Tuesday, March 11, 2014

                             అలలు

అలసి పోని అలలను చూస్తున్నా
అలసిపోయిన నా మనసుని
ఆహ్లాద పరుస్తాయని
చెరిగిపోయిన తీపిగుర్తులను
చేరువ చేస్తాయెమొనని
ప్రతి అలను గమనిస్తున్నా
మరలి వెళ్ళిపోయిన..
నా ప్రతిబింబాన్ని
మరల తీసుకొస్తాయెమోనని..
అలలు వస్తున్నా పోతున్నా..
ప్రతి అల క్రొత్తగ కనిపిస్తుంది..
కానీ..
మరలిపోయిన నా ప్రాణం
మరల రాకున్నది

Monday, March 10, 2014

స్వప్నం

జ్ఞాపకాల బాష్పాలు
అక్షరాలై వర్షిస్తాయి
మనసుకైన గాయాలు
గేయాలై మిగిలాయి
ఒడిపోయిన కన్నీటి కధకు
సాక్ష్యాలై నిలిచాయి

స్వప్నంలో నీరూపం
సాక్ష్యాత్కరిస్తుంది
సరదాగామాట్లాడి
సంగతులెన్నో చెపుతుంది

నమ్మలేకపోతాను
నీవులేని నిజాన్ని
తెల్లార కుండావుంటే
బావుండను కుంటాను

భళ్ళుతెల్లారేసరికి
గుండెగుభేలు మన్నది
గతం నన్ను వెక్కిరించిది
గాయం గుర్తు చేసింది

తలగడపై తడి గుర్తులు
కన్నీటికి ఋజువులుగా
మిగిలివున్నా నేను....
బాష్పాలు రచిస్తూ.....

వాణికొరటమద్ది
10/3/2014
మనోగతం.....

మాసిపోదు మనోగతం
మది చేరదు ఆశాకిరణం
చెరిగిపోని చేదు నిజం
చేరువవదు చిరు దీపం
జ్ఞాపకాల నిట్టూర్పులు
మదిదాటని భావాలు
ఆరిపోని ధు:ఖాలు
ఆగిపోని బాష్పా
లు

మరువలేని అనుభవాలు
మరలిరాని ఆశలు
పెదవిదాటని మాటలు
కనుమరుగైన బాటలు

స్వర్గంలో నువ్వు
శోకంలో నేను
స్వప్నంలో నువ్వు
శూన్యంలో నేను

అమరమై నువ్వు
అవనిలో నేను
స్పర్స  లేక నువ్వు
స్మరిస్తూ  నేను


వాణి కొరటమద్ది
6/3/2014
' ఆశ'

క్రొత్తదనం కోసం..
కాస్త ఆనందం కోసం..

ఆశను అరువు తెచ్చుకుందామంటే..
అడియాశలు ఉచితంగా అంటుకున్నాయి

సంతోషాలను సమీకరిద్దామని
జ్ఞాపకాలలో వెతుకుతువున్నా

దురదృస్టాలను దులిపేద్దామని
అదృస్టాలలో తడుముతువున్నా

ఆవిరైన ఆనందాలను
అశ్రునయనాలలో శోధిస్తున్నా

అక్షరాలను అమరుద్దామంటే
'అమరు'డైన నువ్వే గుర్తొస్తావు

కలలో నువ్వే..
కన్నిటిలో నువ్వే

కొత్త కవితా వొస్తువు
కనిపించడం లేదు

కన్నిటితో కడుపు నింపుతూ
క్రొత్తఆశల కోసం..

అస్రువులతో నిండిన నా కళ్ళు
ఆనందాలకోసం ఆరాటపడుతున్నాయి

అరచేతిలో అరిగిపొయిన రేఖలలో
దురదృస్టమేఅంతిమ రేఖగా మిగిలింది

నిర్దయగా వెళ్ళిపోయిన.
.చిట్టితండ్రికోసం..
నిశిధీ వంక చూస్తూనే వున్నా..
దయతో అదృస్టాలనుమొసుకొస్తూ..
తారసపడతావని' ఆశ'

vani
18/1/2014
సంఘర్షణ


నిష్క్రమించి
నిశ్చింతగా నువ్వు
జీవిస్తూ
జీవచ్చవంగా నేను

జన్మనిచ్చి పునర్జన్మ నివ్వలేని
మనసు పడుతున్న
సంఘర్షణ

మౌనంగా వున్నానో
మనసు చంపుకున్నానో

సమాజం వెలి వేసిందో
వెలి వేశానో

న్యాయాన్ని కోల్పోయానో
అన్యాయం చేశానో

సంఘర్షణ

కష్టాల సంద్రం దాట లేకున్నా
కన్నీటి ప్రవాహంలో
కొట్టుకు పోతే బావుండు

లక్ష్య సాదనలో నిర్లక్ష్యం
స్వార్దం ముందు
ఓడిపోయిన సహనం

సంఘర్షణ

మనీ లోకం
విలువలేని మానవత్వం

తపన ,తాపత్రయం
బాద్యతలు ,బంధాలు
కనరాని సమాజం

బ్రతికి వున్న వారంతా
జీవచ్చావాలేమో...?
మరణించిన వారు
మహాత్ములనుకుంటా..?

సంఘర్షణ

vani
23/1/2014
ఆడపిల్ల


సమాజం ఇది
నొప్పిస్తూ వుంటుంది
మెప్పిస్తూ వుంటుంది
జీవిత పాఠాలను
నేర్పిస్తూ వుంటుంది

గాయం చేసే వాళ్ళూ
గాయాలు మానిచే వాళ్ళూ
రక రకాల మనుషులు
రంగులు మార్చే  వాళ్ళు

అవకాశం.ఇచ్చావా
అదను చూసి ఆవహించేస్తారు

మెచ్చుకోలు నెపంతో
గుచ్చుతూ వుంటారు
మాస్టారే కదాని
మై మరచి పో బాకు

నీలోని పులి చంపెయ్యబాకు
అవసరాన్ని బట్టి
అవతారం మార్చుకో

చదువుకోవాలి  నువ్వు
చరిత్ర తెలుసుకోవాలి

ఆర్దిక స్వాతంత్ర్యం కూడ
నీకు అండగా వుండాలి

మనుష్యుల తత్వాలు చూసి
మసలుకోవాలి

వెళ్ళే దారుల్ని
పరికించి వెళుతుండు
దుష్టశక్తులకు నువ్వు
దూరంగ వుంటుండు

ఎదైతెనేం సుమా
నిన్ను నీవు మలచుకో
ఆడపిల్లను లే అని
అణిగిమణిగి వుండకు
       ఆకాశం నేనైతే....   చిన్నా


అంబరమంత ఆనందంగా..
నువు జీవ్వించాలను కున్నా..
అందకుండా వెల్లావు.

ఆకాశం నేనై..
అక్కున చేర్చుకుందామనుకున్నా..
వెలిగేచుక్కవి నువ్వయ్యవా..
వెతుకుతూవున్నా.
.
అందుకోవాలని ఆశ..
పక్షిని నేను కాక పొతిని..
విమానమై దూసుకుపొదామనుకున్నా..
మనోవేదనతో వేలాడిపోతున్నా..

ఆత్మ బందువు ఆకాశం..
చుక్కలతో,చందమామతొ..
మనసు బాద చెప్పుకుంటా

 నీ పాదాలు వేసిన తప్పటడుగులు..
మా బతుకు బాటను తడి చేశాయి
విఫలమైన మా ప్రయత్నాలు ..
భవిషత్తును శూన్యం చేశాయి.

 అందరూ వున్నాఒంటరితనం
జ్ఞాపకాల 'ఇల'లొ గడిపేస్తూ..

అలసి పోయాను ..
ఓదార్పు కావాలి

భవిష్యత్తు శూన్యం
బాసట  కావాలి

విధి లేక రొజు పేజీనితిప్పేస్తూ..
స డిలేని జీవితం
సంతోషాన్ని తడుముకుంటోంది

ఆశల రెక్కలు విరిగాయి..
అతికించి ఇస్తావా..
 ఎడారిలా జీవితం
ఒయాశిసువై వస్తావా...
అమ్మ మనసు

ఆలంబన పోయింది..
ఆక్రందన మిగిలింది
వృ దా అయిన శ్రమ అంతా
వ్యధగా నాకు మిగిలింది

నీవు లేక నాకు చెప్పలేని నష్టం
ఎలా తీరును ఈ కష్టం
నిను చూడాలని వూన్నా చిన్నా
రాలేవని రోదిస్తున్నా

కన్నీరు రాకుండా..
కష్టం నీకు లేకుండా..
అమ్మ నేనున్నా నంటూ..
భరోసా ఇచ్హావే
'నొప్పించక' ',నొప్పి' లెక..
నే.. చూసుకుంటానన్నావే..

తిరిగిరాని లోకాలకి
తరలి వెళ్ళిఫోయావా..
మరో క్రోత్తలోకంలో
నన్ను మరచి పోయవా..

నువ్వు వొధిలేసిన సాక్ష్యాలు...
నన్ను వెక్కిరిస్తుంటాయి
స్ప్రుశించినపుదల్లా..
నిను స్పర్సించాలని.
నీకొసం మరణించాలని..
మళ్లీ నే జన్మ నెత్తి ..
నీకు పునరజన్మ నివ్వాలని..

నీ కోరికలు తీర్చాలని..
నా హామీలు నెరవేరాలని

సంగమ వేదికలో..
నా మనసు కస్టం..నీకు చెప్పుకుంటున్నా
చింటుగాడి కోసం....

ప్రతిరోజూ సుర్యొదయంతోఫాటు
నా చింటుగాదు వొచ్ఛెస్తాడేమొనని ఆశ..

నలు దిక్కులు వెతుకుతూవుంటుంది నా మనసు..
సంద్య వేళయినా రాని నా చింటుగాడి కోసం..
తపిస్తూ వుంటుంది నాహ్రుదయం...
.
చందమామ అయినా
నా చింటుగాడిని వెంట తీసుకొస్తుందని ..

పున్నమి రాక కోసం
తహ తహ లాడుతుంటాను,,,

అర్ద రాత్రైనా నిదుర రాని నా కన్నులు....
కిటికీలోంచి రోడ్డువైపు చూస్తూనే వుంటాయి.
నా చింటుగాడి రాక కోసం...

అవును
సుర్యొదయం కోసం..
పున్నమి చంద్రుడికోసం..
నా కన్నిరు ఆగిపొయే ..
అద్రుష్ట క్షణం కొసం....
నా చింటుగాడి కోసం.......ఆశగా...ఆత్రంగా