Saturday, June 7, 2014

//అలజడి//

నీ ఊపిరి ఆగిపోయిన క్షణం
ఉక్కిరి బిక్కిరి అయి చలనం కోల్పోయి

మనసంతా అలజడి
చీకటి కమ్మేసి నట్లు
మదిలో భుప్రకంపనలే
నిజం నిజం కాదని ఘోష
పెల్లుబికి సునామీనే అయ్యింది
కెరటాల్లా కన్నీళ్ళు ఎగసి పడ్డాయి

గాయం ఎండుతున్నా
మచ్చ ఇంకా మెరుస్తూనే వుంది
జ్ఞాపకంగా మెలిపెడుతూనే వుంది

కంటిలో చెలమలు నేటికీ
నిండుగానే వున్నాయి
ఒక్కోసారి ఊట ఎక్కువై
పొంగి పోతూ వుంటాయి

ప్రకృతితో సంబందంలేని కన్నీటి వర్షానికి
రుతువులతో పనేముంది

మానిపోని పుండుపై గాట్లు పెట్టేవాళ్ళు వుంటే సరి
సహనం నశిoచి కన్నులు సముద్రాలే అవుతాయి
అంతారాల్లో అలజడి రేగి అతివృష్టిగా మారి పోతుంది

. .....వాణి కొరటమద్ది
7 june 2014

No comments:

Post a Comment