Saturday, May 17, 2014

అరుణ కిరణాల తాకగానె విచ్చుకున్న విరులు
తుమ్మెదలకై ఆహ్వానం పలుకుతూ
మకరందపు మాధుర్యాన్ని ఆస్వాదించమని

అందాల వనం ఆహ్వానం పలుకుతూ
సోయగాలసుమాలను సేద తీరమంటూ

రంగుల పువ్వులు ఇంద్రధనస్సును తలపిస్తూ
చిరునవ్వుల తెమ్మెరలు చిలుకరిస్తున్నాయి

సుమాలు సేద దీరుతూ ప్రకృతి మాత వొడిలో
పచ్చికపై విహరిస్తూ అందాలు చాటు కుంటున్నాయి

పచ్చగా మారిన అవని అహ్లాద పరుస్తూ
పరకనే పానుపు చేసి స్వాగతిస్తూ సేద తీరమని..!!

...వాణి కొరటమద్ది

No comments:

Post a Comment