Saturday, May 17, 2014

// చిట్టి తండ్రి//

అడుగడుగునా ఎదుర్కొన్న సమస్యలు
ఆటుపోట్లను అధిగ మించడానికి
నాన్న నాలో పెంచిన ఆత్మస్ఢైర్యం కారణం
నాన్న లేకున్నా గుర్తుగా మిగిలేవుంది

గతం గునపమై గుచ్చుతున్న జ్ఞాపకమే
ఆరిపోని కన్నీటికి సాక్ష్యమే
శాంతి లేకుండా సాగిపోయిన జీవన గమనం
వేదనతో నిండిన మనసు

గతం గోతుల్లోకి తొంగి చూసినపుడు
గుండె మెలిపెట్టినట్టుగా
మనసులో భూకంపాలే సృష్టింబడతాయి
కన్నీటి కడలి ఉదృతమైన ప్రవాహమే అవుతుంది

అనుక్షణం నిండుకుండలా నేత్రాలు
ఒక్కోసారి పగిలి ప్రవహిస్తూ వుంటాయి
అమ్మ ఓడిపోయిందని
నాకు నేను ప్రశ్నగా మిగిలానేమోనని

బ్రతుకివ్వడానికి సిద్ద పడ్డా
తిరస్కరించిన చిట్టి తండ్రి
అమరమైన మహానుభావుడే

తను తనువు చాలిస్తే
అమ్మకి విశ్రాంతి అనుకున్నాడేమో
మౌనంగా నిర్ణయం తీసుకుని మేధావే అయ్యాడు
గుర్తించలేని నేను వేదనతో మిగిలేవున్నా
అదీ నాకేంత శిక్షో తెలుసుకోలేని చిట్టి తండ్రి
నీవులేక బ్రతికి వున్న జీవచ్చవాన్నని వాడికెలా చెప్పాలి

అమ్మ కస్టం గుర్తించిన చింటుగాడికి చెప్తూ
ఓడిపోయిన అమ్మగా రుజువుగా నే మిగిలేవున్నానని....!!

...వాణి కొరటమద్ది
14 may 2014

No comments:

Post a Comment