గర్బస్త్దానం మొదలు గమ్య స్త్దానం వరకు
అంతులేని ఆరాటం అలుపెరగని పోరాటం
మదిలోని ప్రపంచం మమతలతో నింపుకుని
అదిరించిన బెదిరించిన భావి రూపకల్పనకే
ఒక్కరైన ఇద్దరైనా పది మందీ పిల్లలున్న
మార్పురానీ మమకారం నేర్పుగా జీవన గమనం
నడిపించే శక్తి అమ్మ దారి చూపే దేవత అమ్మ
అప్యాయత నేర్పావు అనురాగపు ఓనమాలు దిద్దించావు
శ్రమ అంతా నీవే భరించి బిడ్డల సుఖం ఆశించావు
నేడు ఆదరణకు నోచుకోకున్నావు నీ బిడ్డలకే భారంగా మారావు
ప్రతిఫలం ఆశించని అమ్మా నీ రుణం తీర్చుకోలేము
ప్రేమగా చూసుకోవడమే అమ్మకి మనమిచ్చే ప్రతిఫలం...!!
...వాణి కొరటమద్ది