Tuesday, April 22, 2014

//అనాద ఆడపిల్ల//

ఆడపిల్లవన్నారు అలుసుగా చూసేరు

అణచి వేస్తున్నారు అంకురంగా నిన్ను

చిదిమేస్తువున్నారు పసిగుడ్డుగానే నిన్ను

చెట్లకొమ్మల మద్య చిగురించినావో

చెత్త కుప్పల నుండి వెలికి వొచ్చావో

ఆలకింపగ రాలేదమ్మ నిను కన్నతల్లి

ఏ మగని శాపానికో బలి అయినదో ఆమె

శాపాలు పెట్టినారు శోకాల పాల్జేసి

మరచినారమ్మ ఆడపిల్ల లేనిదె అమ్మ లేదని

ఆపిల్ల తోనే సృస్ఠి జరిగేనని

ఏ తల్లో వస్తుందినిన్ను ఆదరిస్తుంది

తల్లి కాలేని తల్లి అమ్మ అవుతుంది

నీ వంటి వారిని ఆదరించే శక్తి నీకు యిస్తుంది

వేచిచూడమ్మా చిన్నారి తల్లీ!!!


.......వాణి కొరటమద్ది
4/4/2014
//కన్నిటి జీవనం...!//


అంకురమైన నీ రూపం
అంతులేని అనందం

మరునిమిషం నుండే
తడిమిచూసుకునే తరుణం కోసం తలపించా..
పసిబిడ్డగా స్పర్శించి
పరవసించిపోయా

అనుక్షణం అతి జాగ్రత్తగా
గాజుబొమ్మలా...
ఎదుగుదలకి తపస్సే చేశా,,

సమస్యలను అధిగమించలేక..
అనారోగ్యం..
ఆందోళనతో...
పునర్జన్మనివ్వాలనే సంకల్పం

ఆటుపోట్లను ఎదుర్కొంటూ..
ఆదరణను వెతుకుంటూ..

ప్రయత్నాలు విఫలించి.
విధి వెక్కిరించి
వ్యధకు గురి చేసి

నీ స్పర్శనే దూరంచేసి
కన్నిటి సంద్రంలో పడవేచి

నిజమైన నీ రూపం..
నిజం కాని మా స్వప్నం
విధి వెక్కిరించిన వైనం..
అనంతలోకాలకి నీ పయనం..
కొనసాగుతున్న మా కన్నిటి జీవనం...!

......వాణి కొరటమద్ది
//వెతుకుతూనే వున్నా చిన్నా...!!//

తనువు చాలించినావు
తండ్రి జన్మదినం నాడే
తల్లడిల్లి పోయారు
నీ తల్లి తండ్రులు

విధివంచితుడైనావా..
పోరాడి ఓడావా

నీవు లేక
చితికిపోయిన మాజీవితాలు

అలజడిలో మనసంతా
ఆశలు లేని జీవనం

నటిస్తూ మనుష్యుల్లా
నరకంలో జీవుల్లా

నా కన్నీటి సముద్రానికి
రెండు సంవత్సరాలు పూర్తి

సంవత్సరాలు
గడిచిపొతున్నాయి

కనిపిస్తావేమోనని ఇంకా
ఆశలు చిగురిస్తూనే వున్నాయి

పోయిన ప్రాణం తేలేక
ఉన్న ప్రాణాలను బలవంతంగా బ్రతికిస్తున్నా

కన్నుల్లో వొత్తులు వేసుకుని
వెతుకుతూనే వున్నా చిన్నా

స్వప్నంలో కనిపించే నీ రూపం
శాశ్వితమై నా ముందు నిలబడుతుందేమొనని ఆశ...!

......వాణి కొరటమద్ది

Wednesday, April 16, 2014

//అక్షర కన్నీరు//

విధిరాతను ఎదురీదలేక
వేదనతో మిగిలాను

శాప గ్రస్తనైనాను
శిలలా మిగిలున్నాను

నీవు లేని చేదు నిజం
మానని గాయంగా మిగిలింది

మనసుని పిండెస్తోంది
మరో తలపు లేకుండా

కడలిలోని నీరంతా
నా కన్నుల్లో వున్నట్లు

రాలు తున్న భాస్పాలు
సముద్రమయ్యేటట్లు

రాలేవు నీవని
చిరునవ్వుని మరచి

చెమ్మగిల్లిన అక్షరాల
అమరికలోవుంటుంది

మదిలోని బాదంతా
భావమై పోతుంది

కవితల్లోకన్నీరై
ప్రవహిస్తూనే వుంటుంది

రాలేని నా చిట్టి తండ్రికోసం

.......వాణి కొరటమద్ది
//అనాద ఆడపిల్ల//

ఆడపిల్లవన్నారు అలుసుగా చూసేరు

అణచి వేస్తున్నారు అంకురంగా నిన్ను

చిదిమేస్తువున్నారు పసిగుడ్డుగానే నిన్ను

చెట్లకొమ్మల మద్య చిగురించినావో

చెత్త కుప్పల నుండి వెలికి వొచ్చావో

కన్నీటి సంద్రమై కూర్చుని వున్నావు

ఆలకింపగ రాలేదమ్మ నిను కన్నతల్లి

ఏ మగని శాపానికో బలి అయినదో ఆమె

శాపాలు పెట్టినారు శోకాల పాల్జేసి

మరచినారమ్మ ఆడపిల్ల లేనిదె అమ్మ లేదని

ఆపిల్ల తోనే సృస్ఠి జరిగేనని

ఏ తల్లో వస్తుందినిన్ను ఆదరిస్తుంది

తల్లి కాలేని తల్లి అమ్మ అవుతుంది

నీ వంటి వారిని ఆదరించే శక్తి నీకు యిస్తుంది

వేచిచూడమ్మా చిన్నారి తల్లీ!!!

.......వాణి కొరటమద్ది
4/4/2014
//జంతు జాతీయత//

జాతి ఏదైనా మాది జీవజాతంటూ

కులం మతం మాకు లేదంటూ

భాషాభేదం లేదు

మూగభాష మాదని

రంగులతో పనిలేదు

రాగ ద్వేషాలు మాకు లేవని

స్నేహానికి బేద భావం లేదని

జంతు జాతీయతని చాటుతున్నాయి

కుక్కైతేనేం కోతైతేనేం

ఆకలి వేళ అమ్మగా మారుతూ

మానవులకి సవాలంటున్నాయ్

మానవజాతికి మచ్చలేకుండా

మానవత్వంతో మసలమంటున్నాయ్

సందేశం ఇస్తున్నాయ్

......వాణి కొరటమద్ది
// శ్రీరామ నవమి//

త్రేతాయుగమున రామావతారమున జనియించెను విస్ణువు రావణసంహరణకై
ఇక్ష్వాకవంశపు కోసలదేశపు రాజు దశరధుడు
పుత్రకామేష్టియాగము సలిపినాడు సంతానమునకై
రాముడు ప్రధముడుగా నలుగురు పిల్లలు కలిగిరి
ధర్మపాలనా దక్షుడు ఏక పత్నీ వ్రతుడు
తండ్రి మాటకి కట్టుబడి వనవాసానికేగినాడు
జనక మహారాజు స్వయంవరం చాటింపగ
శివ ధనుర్భంగము గావించి అవనిజ సీతమ్మ మెప్పు పొందెను
చైత్రశుద్దనవమి సీతారాముల కల్యాణం శ్రీరామ పట్టాభిషేకం
ప్రతిమందిరమున రాములవారి కల్యాణం
ఉత్సవమూర్తుల ఉరేగింపులు వసంతోత్సవం
రామదాసు నిర్మించిన భద్రాచల రామాలయం
అంగ రంగ వైభోగంగా అండపిండ బ్రహ్మండంగా
ముత్యాల తలంబ్రాలు కల్యాణంలో ప్రత్యేకంగా
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు
రామ నామ స్మరణం సర్వపాపహరము

......వాణి కొరటమద్ది