Thursday, August 7, 2014

//ప్రశ్నించే గతం//

కునుకు రాని కనులు
ఆలోచనతో అరమోడ్పులౌతాయి
జ్ఞాపకాల గాయాల్ని
మనసు తట్టి లేపుతాయి

ఆగని కన్నీరంతా
వేదనతో ఒలుకుతొంది
ఆశపడుతుంది మనసు
ఆనందపు నీరైతే బావుండని

కోల్పోయిన ఆనందాన్ని
గొoతెత్తి పిలవాలని
చేజారిన నీ రూపాన్ని
చిరునవ్వుతో చూడాలని

చెదిరిపోయిన నీ జీవన చిత్రం
సాగిపోతూ మా జీవన సమరం
ఆకాశంలో చుక్కవైనావో
మరో అమ్మ బిడ్డవైనావో
నాకు మాత్రం దూరమయ్యావు

ప్రశ్నించే గతం
ప్రశ్నార్ధకమైన భవిష్యత్
గుండె గాయాన్ని భరించ లేకుంది
ఆగిపోవాలని ఆరాట పడుతోంది

చిగురిస్తున్న ఆశలు
చితిపై వాలాయి
చిరునవ్వులు
చింతలుగా మిగిలాయి

చేజారిన నీ రూపం
చిధ్రమైన నా హృదయం
పగిలిన ముక్కలన్నీ
గాయాల జ్ఞాపకాలే
గతం నీలి నీడలే

నడిసంద్రంలో నన్నోదిలి
సుడిగుండంలోకి నువు మరలి
బ్రతుకు జ్ఞాపకమై పోయింది
చితికి చేరువై పోతోంది

..వాణి కొరటమద్ది